ఆచరణేది..? 

Date:26/03/2020

విజయనగరం  ముచ్చట్లు:

జంఝావతి జలాశయం నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరందిస్తామని అటు పాలకులు, ఇటు అధికార యంత్రాంగం హామీలు గుప్పిస్తున్నా ఆచరణలో

మాత్రం కనిపించడం లేదు. పేరులో ఉన్న జంఝాటం పథకాన్ని వీడటం లేదు.. సాగునీరు అందించేందుకు రెండు అడుగులు ముందుకేస్తే పనులు నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఏటా వర్షాల

కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతులు ఎప్పుడూ సాగునీటి వనరులున్నాయనే ధీమాను పొందుతారోనని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌ నాటికైనా సాగునీటి కష్టాలు

తీర్చాలని పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అన్నదాతలు వేడుకొంటున్నారు. పార్వతీపురం, సీతానగరం మండలంల్లో ఎగువ కాలువ పరిధిలో పలు అసంపూర్తి పనులతో అన్ని వర్గాల వారికి

అవస్థలు తప్పడం లేదు. జంఝావతి జలాశయానికి కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. జంఝావతి జలశయానికి ఎడమ వైపున కొండ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఎగువ, దిగువ కాలువల

నిర్మాణానికి వీలుగా దీని నమూనాను రూపొందించారు. నమూనా ఆధారంగా కాలువల తవ్వకం పనులు చాలా వరకు పూర్తి చేశారు. జలాశయంలో ముంపు ప్రాంతాలపై ఒడిశా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం

చేయడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
జలాశయంలో సాగునీటి వనరుల ఆధారంగా దిగువ కాలువ పరిధిలోని రైతులకు నీటిని అందించాలని అధికారులు చొరవ తీసుకున్నా శివారు ప్రాంతాలకు చేరడం లేదు. పోనీ ప్రధాన కాలువ నుంచైనా

నీరందుతుందని భావించిన అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. ఏళ్ల పాటు ఇదే దుస్థితి. ఇందుకు కారణం అధికారుల పర్యవేక్షణా లోపమే అనేది వారి ఆరోపణ. పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లోని

ప్రధాన సాగునీటి వనరైన జంఝావతి జలాశయంపై కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, జలిజిపేట మండలాల రైతులు 45 ఏళ్లుగా ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. 2004లో అసంపూర్తి

ప్రాజెక్టుల పూర్తికి శ్రీకారం చుట్టారు. అలా ఆసియాలోనే తొలి రబ్బరు డ్యాంను రూపొందించి మరుసటి ఏడాది జలాశయాన్ని జాతికి అంకితం చేశారు. జంఝావతిలో దిగువ కాలువ నుంచి ఎగువ కాలువకు

ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు ప్రకటించారు. వాస్తవంగా 2004లో రెండు కాలువల ద్వారా కేవలం ఆరువేల ఎకరాలకే సాగునీరు అందేది.

పార్వతీపురం మండలం ఏగిరెడ్డివలస సమీపంలో సైఫను నిర్మాణ పనులు మధ్యలో వదిలేయడంతో అటు సాగునీటికి, ఇటు రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. జలాశయం పరిధిలోని ఏ

గ్రామానికి ప్రజాప్రతినిధులు వెళ్లినా సాగునీటిపైనే నిలదీత సాగేది. దీంతో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పనులు పూర్తికి అంచనాలు మారుతూనే ఉండేవి. అలా గత ప్రభుత్వ హయాంలో రూ.32 కోట్లు

నిధులు మంజూరు చేశారు. హడావుడిగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ఎగువ కాలువ ద్వారా నీటిని అందించేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న కొమరాడ మండలం డంగభద్ర డీప్‌కటఫ్‌ పనులకు రూ.6

కోట్లు అదనపు నిధులు అవసరమని అధికారులు గుర్తించారు. వాటి మంజూరుకు అధికారులు అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టర్ పనుల నుంచి

తప్పుకొన్నాడు. అప్పటి నుంచి సాగునీటి కోసం రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. రబ్బరు డ్యాం ద్వారా రెండు కాలువలకు సాగునీటి అందించేందుకు ఎత్తిపోతల పథకమే ఉత్తమని అధికారులు

భావించారు. ప్రాజెక్టు కిందన దిగువ కాలువను అనుసరించి పంపుహౌస్‌ను నిర్మించారు. నాలుగు వేల క్యూసెక్కుల నీటిని పంపింగు చేసేలా మూడు మోటార్లను ఏర్పాటు చేశారు. అంతా సిద్ధం చేసిన

విద్యుత్తు సరఫరాకు చెందిన పనులు కొన్నాళ్లు అధికారులు విస్మరించారు. పత్రికల్లో కథనాలు వచ్చేంత వరకు అధికారులు స్పందించక పోవడం విశేషం. అంతా సిద్ధం చేశాక మరో సమస్య ఏర్పడింది.

జలాశయం నుంచి దిగువ కాలువకు సరిపడా తూమును ఏర్పాటు చేశారు. అదే నీటిని రెండు కాలువలకు అందించడంలో సమస్య ఏర్పడింది. అలా ఎగువ కాలువ నుంచి కొద్దిపాటి ఆయకట్టుకు మాత్రమేసాగునీటిని అందిస్తున్నారు.

సమిష్టి కృషితో కరోనా మహమ్మరిని తరిమికొట్టాలి

Tags: in practice?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *