పుంగనూరులో దుక్కినుంచి కోత వరకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు పొలం దుక్కి చేయడం నుంచి పంటల కోతల వరకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సంచాలకులు గోపాల్‌ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని మాగాండ్లపల్లె గ్రామంలో జిల్లా కేంద్రం ఏవో శశికళ, రైతు నాగభూషణరెడ్డితో కలసి పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేరుశెనగ, టమోటా పంటలలో సమగ్ర సస్యరక్షణ గురించి వివరించారు. రైతులకు విత్తనశుద్ది, భూసార పరిరక్షణ, లోతు దుక్కులు, ఎరువులు, పచ్చిరొట్ట , వేపకషాయం తయారీ గురించి వివరించారు. రైతులు ఆర్‌బికెల ద్వారా తగిన సలహాలు, సూచనలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో జయంతి, విహెచ్‌ఏ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Post Midle

Tags: In Punganur, farmers have to take care of everything from dukki to harvest

Post Midle
Natyam ad