పుంగనూరులో తల్లి,బిడ్డ ఆరోగ్యం కోసమే పోషకహారం-అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

సమాజంలోని తల్లి,బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకే నాణ్యమైన పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏతూరు గ్రామంలో వైఎస్‌ఆర్‌ పోషణ కార్యక్రమాన్ని ఐసిడిఎస్‌పీవో భారతి ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన సర్పంచ్‌ జయప్రద తో కలసి గర్భవతులకు, చిన్నపిల్లలకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తల్లి,బిడ్డలకు బియ్యం, పప్పు, కోడిగ్రుడ్లు, నూనే,పాలపొడితో సహా అందజేయడం జరుగుతోందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సిబ్బందిచే తల్లి,బిడ్డ , ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ కల్పన , వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: In Punganur, nutrition is only for the health of mother and child – Akkisani Bhaskar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *