పుంగనూరులో ఒకరి పరీక్ష మరోకరురాసి డీబార్‌ -ప్రైవేటు కళాశాలల నిర్వాకం – పోలీస్‌ కేసు

పుంగనూరు ముచ్చట్లు:

ఇంటర్మీడియట్‌ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షల్లో ఒకరికి బదులుగా మరోకరు పరీక్షలు రాసి చిక్కిపోయి, డీబార్‌ కాబడి పోలీస్‌ కేసులో చిక్కుకున్న ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, లెక్చరర్ల బాగోవతం ఇది. సోమవారం పరీక్షల నిర్వహణాధికారి సాయిశంకర్‌రెడ్డి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బసవరాజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎస్వీ జూనియర్‌ కళాశాలకు చెందిన సి.నందకుమార్‌రెడ్డి పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ అతనికి బదులుగా ఎస్వీ డిగ్రీ కళాశాలకు చెందిన ఈ.లక్ష్మణ్‌ అనే బికాం విద్యార్థి పరీక్షలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి పరిశీలించారు. ఒకరు బదులుగా మరోకరు పరీక్షలు రాయడంతో విచారణలో రుజువుకావడంతో నందకుమార్‌ను డీబార్‌ చేశారు. కాగా ఎస్వీ కళాశాల లెక్చరర్‌ సహదేవ్‌ ప్రొద్భలంతో తాను పరీక్షలు రాశానని, ఆవిద్యార్థి తెలపడంతో పరీక్షల నిర్వహణాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, లక్ష్మణ్‌ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు సహదేవ , నందకుమార్‌రెడ్డి, లక్ష్మణ్‌ లపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఉండగా ప్రైవేటు కళాశాలల నిర్వాకంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.\

 

Tags: In Punganur, one person’s exam was written by another, debar – management of private colleges – police case

Leave A Reply

Your email address will not be published.