Natyam ad

పుంగనూరులో  మత్తులో కుమారైను  కుంటలో వేసిన తండ్రి

పుంగనూరు ముచ్చట్లు:

మధ్యం మత్తులో కన్నకుమారైను నీటికుంటలో పడేసిన తండ్రిని పోలీసులు అదుపులోనికి తీసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలో తోపుడుబండిపై  పండ్లవ్యాపారం చేసేవాడు. అయ్యప్ప అనే వ్యక్తికి పీలేరుకు చెందిన రెడ్డెమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి హర్షిత అనే ఏడాదన్నర సంవత్సరం గల పాప కలదు. ఇలా ఉండగా భార్యతో ఉదయం గొడవ పడిన అయ్యప్ప కోనేటిపాళ్యెంలో తన ఇంటి సమీపంలో గల చిన్నకుంటలో బాలికను తీసుకెళ్లి పడేశాడు. దీనిని ఆ సమయంలో అటుగా ఆటోలో వెళ్తున్న చంద్రశేఖర్‌ అనే ఆటో డ్రైవర్‌ గమనించి బాలికను నీటికుంటలో నుంచి వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ ప్రాణపాయం నుంచి బయటపడింది. వెంటనే నిందితున్ని ఆప్రాంత వాసులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: In Punganur, the father left his daughter lame due to intoxication

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.