Natyam ad

పుంగనూరులో తల్లిబిడ్డ క్షేమంగా ఉండాలన్నదే నినాదం

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో తల్లిబిడ్డ ఇద్దరు ఆరోగ్యవంతులుగా , క్షేమంగా ఉండాలన్న నినాదంతో వైఎస్సార్‌ పోషణ కార్యక్రమాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కౌన్సిలర్‌ పూలత్యాగరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని కోనేటిపాళ్యెంలో కౌన్సిలర్‌ గంగులమ్మతో కలసి గర్భవతులకు, బాలింతలకు వైఎస్సార్‌పోషణ క్రింద ఆహారపదార్థాలను పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని రహమత్‌నగర్‌లో కౌన్సిలర్‌ సాజిదాబేగం , రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌లు వైఎస్సార్‌పోషణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్యాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని , ఆయన చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా మహిళలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags; In Punganur, the motto is to keep the mother and child safe

Post Midle