Natyam ad

పుంగనూరులో గ్రామసారధులతో పార్టీ పటిష్టం

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ పటిష్టం కోసం ఏర్పాటు చేసిన గ్రామసారధుల ద్వారా విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచి పటిష్టం చేస్తామని నియోజకవర్గ పార్టీ పరిశీలకులు జింకా వెంకటాచలపతి తెలిపారు. గురువారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , మండల సచివాలయ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి ,పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తో కలసి ఆయన నిర్వహించారు. జింకా వెంకటాచలపతి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికి అందించడం జరిగిందన్నారు. సచివాలయ పరిధిలో గృహసారధులు తమకు కేటాయించిన 50 గృహాలను తరచు సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పార్టీకోసం పని చేసే గ్రామసారధులకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసే వారికి భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతను గ్రామసారధులు క్రమశిక్షణతో చేపట్టాలని పిలుపునిచ్చారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని కొనియాడారు. పథకాల అమలులో పుంగనూరు ఆదర్శంగా ఉందని తెలిపారు. పార్టీని పటిష్టత కోసం గ్రామసారధులు సైనికులవలే పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి,మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, విజయభాస్కర్‌రెడ్డి, రమణ, ప్రభాకర్‌నాయక్‌, సుధాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నంజుండప్ప, రామకృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సురేంద్రరెడ్డి, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; In Punganur, the party is strong with village headmen

Post Midle