పుంగనూరులో వాడవాడల జగనన్న నువ్వే మా నమ్మకం కార్యక్రమం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు జగనన్న నువ్వే మానమ్మకం కార్యక్రమాన్ని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. శనివారం మండలంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, సచివాలయాల కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో చదళ్ల, గుడిసెబండ, కపాడం మిట్టపల్లె గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు. లబ్దిదారులతో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు సేకరించి, సెల్‌ఫోన్‌లలో సీఎంతో మాట్లాడించారు. అలాగే పట్టణంలోని రహమత్‌నగర్‌లో రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, కౌన్సిలర్ సాజిదాబేగం, గోకుల్‌వీధిలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, సచివాలయాల కన్వీనర్ వరదారెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులతో సమాచారం సేకరించి రశీదులు అందజేశారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ సిఆర్.లలిత, కౌన్సిలర్లు కొండవీటి కాంతమ్మ, అర్షద్‌అలీ, కిజర్‌ఖాన్, నయీంతాజ్, భారతి, గంగులమ్మ, విజయభారతి, ఆదిలక్ష్మీ, రాఘవేంద్ర, రేష్మాలు జగనన్న నువ్వేమా నమ్మకం కార్యక్రమాన్ని ఆయా వార్డులలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పార్టీ నాయకులు , పార్టీ నాయకులు జయరామిరెడ్డి, నాగరాజారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, విజయభాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రాజేష్, మురళి, మహబూబ్‌బాషా, గృహసారధులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Tags; In Punganur, Vadavadala Jagananna Nuvve Maa Vernaman program
