Natyam ad

పుంగనూరులో మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి- న్యాయమూర్తి కార్తీక్‌

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలోని మహిళలందరు అన్ని రంగాల్లోను రాణించేలా అభివృద్ధి చెందాలని ఇందుకోసం పట్టుదలతో కృషి చేయాలని పుంగనూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ పిలుపునిచ్చారు. గురువారం హర్‌గర్‌ తిరంగా కార్యక్రమాన్ని మండలంలోని మోదుగులపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: In Punganur, women should grow up to excel in all fields – Justice Karthik

Post Midle