రాజస్థాన్ లో భార్య, భర్తల పోటీ

In Rajasthan, husband and husband compete

In Rajasthan, husband and husband compete

Date:23/11/2018
జైపూర్ ముచ్చట్లు:
సాధారణంగా ఎన్నికల్లో అన్నదమ్ములు, మామా-అల్లుళ్లు, బావ-బావమరిది ఇలా పోటీ చేస్తుండటం చూస్తుంటాం. కానీరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే ఒకే అసెంబ్లీ స్థానం నుంచి భార్యాభర్తలు బరిలోకి దిగారు. పోటీలాంటివి వీరి మధ్య లేకున్నా.. భార్యాభర్తలు ఒకే స్థానంలో బరిలోకి దిగడం ఆసక్తికర అంశమే. దీంతో వీరు పోటీ చేస్తున‍్న బికనీర్‌ ఈస్ట్‌పై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. కానీ వీరు స్వతంత్ర అభ్యర్థులు అని తెలిసి నేతలు రిలాక్స్‌ అయ్యారు. అయితే ఇద్దరు ఎందుకు పోటీ చేస్తున్నారో కారణం తెలిస్తే షాక్‌ అవుతారు. స్వరూప్‌ చంద్‌ గెహ్లాట్‌ (55), మంజులత గెహ్లాట్‌ (52) భార్యాభర్తలు. స్వరూప్‌ చంద్‌ 1988 నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తాజాగా మరోసారి బికనీర్‌ ఈస్ట్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మంజులత కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీంతో ఒకే సీటు కోసం భార్యాభర్తలు పోటీచేస్తున్నారని రాజస్థాన్‌ రాష్ట్రం మొత్తం మార్మోగిపోయింది. ఒకరం గెలిస్తే మరొకరం పరస్వరం సహకరించుకుంటామని చెప్పడం గమనార్హం. స్వరూప్‌ చంద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడున్నర దశాబ్దాల కిందట మంజులతతో వివాహం జరిగింది. మాకు ముగ్గురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశాం. మేం సంతోషంగా ఉన్నాం. 30 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అయితే ప్రచారానికి నేను వెళ్లగా నా భార్య ఇంటిదగ్గర ఒంటరిగా ఉంటోంది. ఈ సారి అలా అవ్వకూడదని ఆమెతో నామినేషన్‌ వేయించా. ప్రచారానికి ఇద్దరం ఒకే స్కూటర్ మీద వెళ్లవచ్చునని’ వివరించారు. ‘నేను గెలిస్తే భర్త సహకారం తీసుకుంటా. నా భర్త గెలిస్తే ఆయన వెన్నంటే ఉంటా. ప్రచారానికి వెళ్లినా ఇద్దరం ఒకేసారి బయటకువెళ్తాం’ అని మంజులత చెప్పారు. డిసెంబర్‌ 7న ఎన్నికలు, 11న ఫలితాలు ప్రకటిస్తారు.
Tags:In Rajasthan, husband and husband compete

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *