Natyam ad

సోమల మండలంలో మూడో రోజు ముగిసిన పల్లెబాట కార్యక్రమం

సోమల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం.శుక్రవారం నాడు ఇరికిపెంట, నెల్లిమంద, కందూరు, తమ్మినాయనపల్లి పంచాయతీల పరిధిలోని 37 పల్లెల్లో పర్యటించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసోమల మండలంలో మొత్తం మూడు రోజుల్లో 126 పల్లెలు పర్యటించిన మంత్రిఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో ముగిసిన పల్లెబాట కార్యక్రమంనియోజకవర్గంలో మొత్తం 12 రోజుల్లో 423 పల్లెలు పర్యటించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.వివిధ పల్లెల్లో పార్టీలో చేరిన ముప్పై మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు సిఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారు.పేదరికాన్ని రూపుమాపడం కోసమే సంక్షేమ పథకాలు.నియోజకవర్గం లో ఈ స్థాయిలో అభివృద్ది సంతోషాన్ని ఇచ్చింది.అడిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఆమోదం తెలిపిన సిఎం కు ధన్యవాదాలు.నాకు తెలిసినప్పటి నుండి స్కూల్స్ పై ఇంత శ్రద్ధ ఏ ముఖ్యమంత్రి చూపలేదు.నియోజకవర్గం లో ప్రజలు మద్దతు వెలకట్టలేనిది.అనేక సంవత్సరాలు గా నాకు మద్దతుగా నిలుస్తున్నారు.వారి రుణం తీర్చుకునే అవకాశం ఈ ప్రభుత్వ హయాంలో లభించింది.90 శాతం రోడ్లు పూర్తి చేశాం, ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇవ్వనున్నాం, ప్రతి ఇంటికి పథకాలు అందిస్తున్నాం.ఏ సమస్య ఉన్న ప్రజలు నన్ను నేరుగా కలవచ్చు, ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లెబాట

 

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు సిఎం వైఎస్ జగన్ పక్షానే ఉన్నారని అన్నారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం సొమల మండలంలో మూడో రోజు పల్లెబాట కార్యక్రమం చేపట్టిన మంత్రి, మండలం లోని ఇరికిపెంట, నెల్లిమంద, కందూరు, తమ్మినాయనపల్లి పంచాయతీల పరిధిలోని 37 పల్లెల్లో పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. ఇక మిగిలిన సమస్యలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోమల మండలంలో మొత్తం మూడు రోజుల్లో 126 పల్లెలు పర్యటించిన మంత్రి, ఇంతకుముందే పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 12 రోజుల్లో 423 పల్లెలు పర్యటించారు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు సిఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని అన్నారు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కేవలం పేదరికాన్ని రూపుమాపాలనే ఒక నిస్వార్థ ఆలోచనతో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం లో ఈ స్థాయిలో అభివృద్ది సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ పని అడిగినా, ఏ ప్రాజెక్టు ప్రతిపాదించినా వాటికి వెంటనే ఆమోదం తెలుపుతున్నందుకు సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

 

 

అదేవిధంగా తనకు తెలిసినప్పటి నుండి స్కూల్స్ పై ఇంత శ్రద్ధ ఏ ముఖ్యమంత్రి చూపలేదని, విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి వాస్తే, పేదరికం లో మగ్గుతున్న కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని భావించి విద్య రంగానికి అనేక పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు అని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం లో ప్రజలు మద్దతు వెలకట్టలేనిదని, అనేక సంవత్సరాలు గా తనకు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం ఈ ప్రభుత్వ హయాంలో లభించిందని హర్షం వ్యక్తం చేశారు. అందుకే నియోజకవర్గంలో ఇప్పటికే 90 శాతం రోడ్లు పూర్తి చేశామని, ఇంటింటికీ కుళాయి ద్వారా త్వరలోనే నీరు అందిస్తాం అని అన్నారు. నియోజకవర్గం లో దాదాపు ప్రతి ఇంటికి పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. ఏ సమస్య ఉన్న ప్రజలు తనను నేరుగా కలసి, వారి సమస్యలు తెలపాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లెబాట కార్యక్రమం చేపడుతున్నామని స్పష్టం చేశారు మంత్రి.

 

 

 

ఇక శుక్రవారం నాడు పల్లెబాట లో బాగాంగ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు మంత్రి. మండలం లోని ఇరికిపెంటలో వెల్నెస్ సెంటర్ నూతన భవనం, తమ్మినాయనిపల్లిలో ఆర్.ఓ ప్లాంటును ప్రారంభించారు మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పల్లెబాట లో బాగంగా రోజు వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో శుక్రవారం ఒక్క రోజు దాదాపు 30 మందిపైగా టిడిపిని వీడి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మండలం లోని కమ్మపల్లికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ నాయుడుతో సహా మరో 15 మంది టిడిపి కార్యకర్తలు వైసిపి చేరారు. వారికి మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

Tags; In Somala mandal, the third day of the village walk program ended