శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.

8 పరదాలు విరాళం :
హైదరాబాదుకు చెందిన శ్రీ శ్రీనివాసులు అనే భక్తుడు ఈ సందర్భంగా ఆలయానికి 8 పరదాలు విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ దాము, అర్చకులు బాబుస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags:In Sri Padmavati Ammavari Temple, Koil Alwar Thirumanjanam is the science
