Natyam ad

వ్యూహరచన, సమర రచనల్లో

కమల దళం

న్యూఢిల్లీ ముచ్చట్లు:

రాజ‌కీయ‌పార్టీల‌కు అధికార యావ వుంటుంది. అధికారంలో వున్న పార్టీల‌కు  ఇత‌ర ప్రాంతా ల‌కూ అధికారం విస్త‌రించాల‌నీ వుంటుంది. అందుకు ఇత‌ర ప్రాంతాల్లో ప్ర‌భుత్వం కార్య‌క‌లాపాల్లో జోక్యం చేసుకుని వారి లోపాల‌ను ఆస‌రా చేసుకుంటారు. మోడీ నాయ‌క‌త్వంలోని బిజెపి స‌ర్కార్ ప్ర‌స్తుత రాజ‌కీ య ఎత్తుగ‌డ‌ల‌న్నీ ఇత‌ర రాష్ట్రాల్లోనూ కాషాయం క‌ప్పేద్దామ‌నే!త‌మ మాటే అంద‌రూ వినాల‌ని, త‌న పంధానే అంద‌రూ అనుస‌రించాల‌ని మంకుప‌ట్టు ప‌ట్టే నాయ‌క‌త్వం లోని పార్టీ అదే ప‌ద్ధ‌తిలో ముందుకు వెళుతుంది.  పార్టీ అధినేత‌, ప్ర‌భుత్వ అధినేత మ‌ధ్య స్నేహ‌బంధం,  ఆలోచ‌నా విధానం క‌లిసిక‌ట్టుగా సాగుతున్న‌పుడు ఇత‌ర రాష్ట్రాల్లోనూ తమ పార్టీ అధికారంలోకి రావ‌డానికి చేసే వ్యూహాలు, వేసే ఎత్తుగ‌డ‌లు ఎప్పుడూ వూహించ‌నివిగానే వుంటాయి.పాల‌న స‌క్ర‌మంగా సాగుతోం ద‌ని అనుకుంటూండ‌గానే ఏదో ఒక‌మిష‌తో లేనిపోని అవాంత‌రాలు క‌ల్పించి దానికి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బాధ్యునిగా చేసి తిప్ప‌లు తంటాలు పెట్టి అస‌మ‌ర్ధ‌పాల‌న అంటూ స్టాంప్ వేయ‌డం బిజెపీ వారికి తెలిసి నంత‌గా మ‌రెవ్వ‌రికీ తెలియ‌దు. అదే పాల‌సీతో తెలుగు రాష్ట్రాల మీద గ‌త కొంత కాలం నుంచి ఎగ‌బ‌డు తున్నారు క‌మ‌ల‌నాధులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి అధికారంలోకి వ‌చ్చి చ‌క్రం తిప్పా ల‌న్న ఆలోచ‌న‌తోనే ప్ర‌తీ అడుగూ రాష్ట్ర పాల‌నాంశాల్లోకి దారితీసేలా చేస్తున్నారు. మ‌హారాష్ట్రలో అడుగు పెట్టి అక్క‌డి  శివ సేన ప్ర‌భుత్వాన్ని త‌ల‌కిందులు చేసింది. ఉద్ధ‌వ్ థాక్రే ప్ర‌భుత్వం  బిజెపి వ్యూహాల‌కు నిల‌వ‌లేక దిగిపోవా ల్సి వ‌చ్చింది. బిజెపి త‌న పార్టీ పేరు చెడ‌కుండా ప్ర‌తిష్ట దెబ్బ‌తిన‌కుండా శివ‌సేన లోనే విభేదాలు త‌లె త్తేలా చేసి రెబెల్ గ్రూప్‌ని ఉత్సాహ‌ప‌రిచి ఉద్ధ‌వ్ ని స్వ‌గృహానికి పంపించిన చద రంగం బిజెపి వ‌ల్ల‌నే అయింది. మోడీ ఆలోచనలు అన్నీ ఇందిరమ్మని త‌ల‌పిస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు మేధా వులు. 19 రాష్ట్రాలలో అధికారం లో వున్న కమలం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కలుపు కోవాలని వ్యూహాలు పన్నుతోంది. బిజెపి త‌న కీల‌క‌నాయ‌కుల‌ను అంద‌ర్నీ రెండు రాష్ట్రా ల్లోనూ ప‌ర్య‌టించి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించేందుకు పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌ను బాగానే ఉప యోగించుకుంది. ఇక వేగుల నివేదిక‌లు అమిత్ షాకు చేరగానే అవి బ్లూ ప్రింట్‌కి మారడానికి ఆట్టే కాలం ప‌ట్ట‌దు. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం వుంది.

 

 

Post Midle

గ‌నుక తీరిగ్గానే వ్యూహ ర‌చ‌న‌, స‌మ‌ర ర‌చ‌న చేసుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారం చేజిక్కించుకునే గ‌ట్టి నిర్ణ‌యానికి వ‌స్తుంది. ఇప్పుడే ఆ భ‌యాన్ని పాల‌కుల‌లో కల్పించడం  కంటే క్ర‌మేపీ భ‌యాందోళ‌న‌ను ఎక్కించి  చివ‌ర‌గా  దెబ్బ‌కొట్టాల‌న్న‌ది క‌మ‌ల‌నాధులు ఎంచు కున్న పంథా కావ‌చ్చు. అయితే  యావ‌త్ దేశాధికారం కోసం కమలం పార్టీ వాళ్ళు ఇత‌ర రాష్ట్రాల పార్టీల‌ను, నాయకులని లాలి స్తారు, బుజ్జగిస్తారు, భ‌యపెడతారు, కొంటారు అనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది. అందుకు టిఆర్ ఎస్ పార్టీ నుంచి వీల‌యినంత మంది ని ఆక‌ట్టుకునేందుకు వ‌ల విసిరింది. వ‌ల‌కి మెల్ల‌గా చిక్కేవారంతా బిజెపి విజ‌యానికి బాట‌లు వేయ‌క‌పోరు. బిజెపి ఇదే పంధాను ప‌శ్చిమ బెంగాల్‌లో అమ‌లు చేసింది.  ఇతర పార్టీ నేతలు భారతీయ  జనతా పార్టీ  రకరకాలుగా ఆకర్షిస్తుంది, దాని కోసం ఏం  చేయాలో ఆ పార్టీ వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలీదు. ఎన్ని అస్త్రాలువాడాలో అన్నివాడుకుంటుంది. సి.బి.ఐ, ఈ డి, ఐ టి వుంది. ఈ డి నోటిసులు నేతలకి ఎలా వస్తు న్నాయో కొత్తగా చెప్పకర్లేదు. ఈ మధ్య‌ తెలంగాణాలో కూడా నోటీసులు ఊపు అందుకున్నాయి. తర్వాత టి ఆర్ ఎస్ ని బలహీనపరిచే రాజకీయం ప్రారంభం కావొచ్చు నేమో. దీనిలో భాగంగా  కేంద్రం సహాయ నిరాకరణ చేయడం తద్వారా రాష్ట్ర అభివృద్ధి నీరు గార్చడం, అధికార పార్టీ నేతల్లో  అసంతృప్తి  సృష్టించడం తద్వారా తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చు కుని అధికారం లో  వచ్చాకా ఎదో చేస్తామని చెప్పి  తర్వాత వాటిని అమలు చేయకపోవడం, ప్రశ్నిస్తే ఈ డీ లేదా సి బి ఐ ని ప్రయోగించడం లాంటివి చేస్తోంది. మొత్తానికి మోదీ వ్యూహ రచన పూర్వం ఇందిర వ్యూహ రచనను తలపిస్తోందని రాజకీయ నిపుణులు  విశ్లే షిస్తున్నారు.

 

Tags: In strategic and martial writings

Post Midle

Leave A Reply

Your email address will not be published.