చైనాలో 56,000 స్క్రీన్స్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ ల ‘2.0’ 

In the 56,000 screens in China, Superstar Rajinikanth, Great Director Shankar's '2.0'

In the 56,000 screens in China, Superstar Rajinikanth, Great Director Shankar's '2.0'

Date:06/12/2018
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన విజువల్‌ వండర్‌ ‘2.0’. ఈ చిత్రం నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా టాక్‌ తెచ్చుకుంది. మొదటి నాలుగు రోజులకే 400 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్‌ని ఇప్పుడు చైనాలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ చైనాలోని హెచ్‌వై మీడియాతో అసోసియేట్‌ అయి ‘2.0’ చిత్రాన్ని చైనా భాషలో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తోంది. హెచ్‌వై మీడియా ప్రముఖ నిర్మాణ సంస్థలు సోని, ట్వంటియత్‌ సెంచరీ ఫాక్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌, యూనివర్సల్‌, డిస్నీ సంస్థలతో అసోసియేట్‌ అయి ఎన్నో సినిమాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకొని చాలా గ్రాండ్‌గా ‘2.0’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చైనాలో 10,000 థియేటర్స్‌లో 56,000 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అందులో 47,000 స్క్రీన్స్‌లో 3డి వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. 2019 మే లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Tags:In the 56,000 screens in China, Superstar Rajinikanth, Great Director Shankar’s ‘2.0’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *