చిత్తూరు ముచ్చట్లు:
జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15 న ఘనంగా నిర్వహించే 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు మరియు పోలీసుల కవాతు రిహార్సల్స్ ను ఎస్పీ పరిశీలించారు.భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ చిత్తూరు DTC పెరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా స్వాతంత్ర వేడుకలు నిర్వహించడానికి ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధకారులు, సిబ్బంది DTC పెరేడ్ గ్రౌండ్స్ నందు పెరేడ్ రిహార్సిల్స్ నిర్వహించారు. ఆర్.ఐ. సుధాకర్ పెరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ జాతీయ పతాకము ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించి పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పరేడ్ ప్రదర్శన పరిశీలించారు.ఈ కార్యక్రమం అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం నాడు మరింత ఉత్సాహంగా కవాతు ప్రదర్శన చేయాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన, తదితర వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజలకు కల్పించాల్సిన భద్రత & సౌకర్యాలను సమీక్షించి, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచలను తెలియచేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావు, ఏ.ఆర్. డి.ఎస్పీలు మహబూబ్ బాష, ఇలియాస్ బాష, ఆర్.ఐ.లు భాస్కర్, సుధాకర్, ఆర్.ఎస్.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:In the 78th Independence Day celebrations, SP V.N. Manikantha Chandolu