సిటీలో 26 చెరువుల్లో గుర్రపు డెక్క

Date:16/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మహానగరంలోని చెరువులను పునరుద్దరించి, వాటికి పూర్వ వైభవం తీసుకు రానున్నారు. ముఖ్యంగా నగరంలోని పలు చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి, దోమల బెడద పెరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులను సైతం పరిగణలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించే సమరం ప్రకటించింది. అంతేగాక, చెరువును మెరుగ్గా నిర్వహించేందుకు ప్రైవేటు సంస్థలకు మూడేళ్ల పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన అప్పగించేందుకు కూడా సిద్దమైంది. నగరంలో ఐదు ఎకరాల స్థలంలో ఉన్న కుంటల్లో ఎంటమాలజీ విభాగం, అంతకన్నా ఎక్కువ స్థలంలో ఉన్న చెరువుల్లో జీహెచ్‌ఎంసీ లేక్ విభాగం, నీటి పారుదల శాఖ, ఎంటమాలజీ విభాగాల సంయుక్త్ధ్వార్యంలో ఈ గుర్రపు డెక్కను తొలగించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీలోని ఒక్క ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలోనే 16 చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించారు. మరో ఏడు చరువుల్లో దీన్ని తొలగించే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 220 మంది కార్మికులుల లంగర్‌హౌజ్ నుంచి హైకోర్టు, పురానాపూల్ వరకున్న మూసీ నదిలో గుర్రపు డెక్కను తొలగి స్తూ, దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పెరిట్రియాన్ని స్ప్రే చేస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌లో గుర్రపు డెక్క అత్యంత తీవ్రంగా ఉన్న 26 చెరువుల్లోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటి వరకు రూ. 7.65 కోట్లను వెచ్చించి గుర్రపు డెక్కను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నాచారంలోని పెద్ద చెరువు, నాచారం పటేల్ చెరువు, లాలాగూడలోని ఎర్రగుంట, సరూర్‌నగర్‌లోని పెద్ద చెరువు, రామంతాపూర్ చెరువు, రామంతాపూర్ చిన్నచెరువు, హాఫీజ్‌పేటలోని కొత్త చెరువు, హాఫీజ్‌పేటలోని కైదమ్మగుంట, ఖానాపెడ్‌లోని తమ్మడికుంట, లింగంపల్లిలో గోపీ చెరువు, లింగంపల్లిలోని చాకలివాణి చెరువు, మదీనగూడ పేటల్ చెరువు, మదీనగూడ ఈర్ల చెరువు, మక్తా మహాబూబ్‌పేటలోని పెద్దకుడి చెరువు, మియాపూర్‌లోని గురునాథ్ చెరువు, చందానగర్‌లోని మల్లయ్యకుంట, బక్షి కుంట, బాచుకుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, ఎల్లమ్మచెరువు, బీమునికుంట, మూసాపేటలోని ముళ్లకత్వ చెరువు, అల్లాపూర్‌లోని సైదయ్యవానికుంట, సున్నం చెరువు, హైదర్‌నగర్‌లోని అలీతలాబ్ చెరువు, కూకట్‌పల్లిలోని పరికి చెరువు, కాముని చెరువుల్లో ఇప్పటి వరకు గుర్రపుడెక్కను తొలగించారు.
Tags:In the city of 26 pond horses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *