మరుదొడ్ల నిర్మాణంలో టీడీపీ కొండెపి ఎమ్మెల్యే కోట్ల రూపాయల స్కామ్.. వైఎస్సార్ సీపీ ఇంఛార్జి అశోక్‌బాబు
చివరికి పేదలకు మంజూరైన మరుగుదొడ్లనూ వదలని టీడీపీ అవినీతి
చెంబులతో టీడీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన బాధితులు
టీడీపీ స్కామ్ పై కొండెపిలో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ

కొండెపి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలు స్వచ్ఛభారత్ నిధులను కాజేశాయని వైసీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రకాశం జిల్లా కొండెపిలో టీడీపీ మరో కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న టీడీపీ నేతలు చివరికి మరుగుదొడ్లను కూడా వదల్లేదని.. కొండెపి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పేదలకు మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి చేశారని వైఎస్సార్ సీపీ కొండెపి ఇంచార్జి అశోక్‌బాబు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛభారత్, ఉపాధి హామీ పథకం కింద విడుదలైన నిధులను కాజేశారని వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి వరికూటి అశోక్‌బాబు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం టంగుటూరులోని ఆయన పార్టీ కార్యాలయం నుంచి టి. నాయుడపాలెంలోని టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఇంటి వరకు ర్యాలీ చేపట్టాలని అశోక్‌బాబు నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ యాత్రకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ని తొలుత వారించారు. అనంతరం పలు షరతులతో ర్యాలీకి అనుమతులు మంజూరు చేయగా.. కొండపి నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున వైఎస్సార్ సీపీ నాయకులు తరలివచ్చారు. ఎమ్మెల్యే స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నిటికంటే.. చెంబులతో ఎమ్మెల్యే స్వామి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా కూడా నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డోలా, ఇంఛార్జి అశోక్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వారి ఇళ్లకు తరలించి బయటకు రాకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే అవినీతి జరిగిందిలా..
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాస్యం స్వచ్ఛత లక్ష్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం కేంద్రం స్వచ్ఛభారత్, ఉపాధి హామీ నిధులను కేటాయించింది. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉండటంతో అప్పటికే ఏర్పాటైన జన్మభూమి కమిటీలు కేంద్రం నిధులను పక్కదారి పట్టించాయని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కొండపిలో పెద్దఎత్తున స్కామ్ జరిగిందని సమాచారం. ఇక దీనిపై కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి వరికూటి అశోక్‌బాబు పలుమార్లు టీడీపీ ఎమ్మెల్యే స్వామిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కొండపిలో మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్, ఉపాధి హామీ నిధులు దాదాపు 45 కోట్లు కేటాయించిందని.. ఆ నిధులతో 35 వేలకు పైగా మరుగుదొడ్డు నిర్మించాల్సి ఉండగా.. దాదాపు 65 శాతం వరకు ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టలేదని అశోక్‌బాబు ఆరోపిస్తున్నారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆర్టీఐకి ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని కూడా చూపిస్తున్నారు. పేదల కోసం కేటాయించిన నిధులను కాజేయడం దారుణమని అశోక్‌బాబు మండిపడుతున్నారు.
విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఎమ్మెల్యే డోలా యత్నం..
కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు స్వామి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి అశోక్‌బాబు చెబుతున్నారు. ఇవాళ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా ర్యాలీ చేస్తామని ప్రకటించగా.. దాన్ని డైవర్ట్ చేసేందుకు డోలా నాటకాలు ఆడుతున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. నియోజకవర్గంలో అవినీతి చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుండగా.. తాను ఎలాంటి తప్పుచేయలేదని నిరూపించుకోకుండా.. టీడీపీ నాయకులు కూడా ర్యాలీ చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిజాయతీ ఎంటో నిరూపించుకోవాలని సవాలు విసిరారు.
ప్రశాంతంగా ఉండే కొండెపిలో టీడీపీ అవినీతి అలజడి..
కొండపి నియోజకవర్గం వాస్తవానికి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది కూలినాలి చేసుకుని జీవిస్తుంటారు. ఇక అక్కడ డోలా బాలవీరాంజనేయులు స్వామి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అవినీతి కార్యక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఎమ్మెల్యే చేసిన అవినీతిని ప్రశ్నిస్తే.. వారిపై దాడులకు దిగుతున్నారని పలువురు చెబుతున్నారు. ఇక తాజాగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునివ్వగా.. టీడీపీ ఎమ్మెల్యే స్వామి తన రౌడీలతో వైఎస్సార్‌సీపీ నాయకులపైకి దాడికి వచ్చారని వైసీపీ ఇంఛార్జి అశోక్‌బాబు ఆరోపిస్తున్నారు. వేసుకున్న చొక్కాను ఎమ్మెల్యే డోలా చించేసుకుని తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపణుల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డోలా అవినీతి బట్టబయలు అయ్యిందని.. నియోజవర్గ ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో డోలా ఓటమి ఖాయమని.. ప్రజలు అవినీతికి తావు లేకుండా.. సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ పాలన కావాలనుకుంటున్నారని అశోక్‌బాబు స్పష్టం చేశారు.
Tags: In the construction of toilets, TDP Kondepi MLA scam of crores of rupees. YSR CP in-charge Ashok Babu
