జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ లో

In the housing scheme of journalists

In the housing scheme of journalists

-డీపీఆర్వోలకు నేరుగా దరఖాస్తులు.
– జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు
-తొలివిడతగా ఐదువేల గృహాల మంజూరు
– అర్బన్ లో పింక్ కార్డుఉన్నా గృహం మంజూరు
-ఏపీయూడబ్లూజే నాయకులకు
-రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు హామీ…..
Date:15/11/2018
విజయవాడ ముచ్చట్లు:
అవసరమైన మరిన్ని సడలింపులు చేసైనా జర్నలిస్టుల కు గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.   గురువారం ఉదయం విజయవాడ లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో ఏపీయూడబ్లూజే ప్రతినిధుల బృందం ఈ విషయంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లడం జరిగింది. దాంతో మంత్రి సానుకూలంగా స్పందించి ఆన్ లైన్లో సమస్యలు తలెత్తిన వారు తమ దరఖాస్తును నేరుగా డీపీఆర్వోలకు ఇచ్చే అవకాశం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ లేక జేసీ టు ఆధ్వర్యంలో హౌసింగ్ డీఎం, డీపీఆర్వోలు జర్నలిస్టుల తో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి పథకం అమలుపై చర్చించి అక్కడికక్కడే సమస్య పరిష్కరించే విధంగా ఆదేశాలిస్తామని చెప్పారు.  గ్రామీణ విలేకరుల కు తొలివిడతగా ఐదువేల గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.  వీటి కేటాయింపు కార్యక్రమాన్ని డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి వాటిని ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తామన్నారు. అర్బన్ జర్నలిస్టులకు పింక్ రేషన్ కార్డు ఉండి సాలీనా ఆరు లక్షల ఆదాయం మించని వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.
వయస్సు, సర్వీసు సర్టిఫికేట్ ఇవ్వాలనే నిబంధనలను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు.  ఆన్‌లైన్‌ విధానంలో అనేక సాంకేతికత ఇబ్బందులు ఎదురౌతున్నందున దాని స్థానంలో ఒరిజనల్ దరఖాస్తులను పూర్తి చేసి అందజేసే సౌకర్యం కల్పించాలని,
అక్రిడిటేషన్ కల్గిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు  హౌసింగ్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినందున దానిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలని, ఆధార్ కార్డు, అక్రిడిటేషన్ కార్డు మాత్రమే జర్నలిస్టులకు ప్రధాన ఆధారంగా పరిగణించాలని, కుల, ఆదాయ, వయస్సు, సర్వీసు ధృవీకరణ పత్రాలను మినహాయించాలని,
రేషన్ కార్డు నిబంధనలు కూడా తొలగించాలని కోరుతూ రాష్ట్ర గృహ నిర్మాణ, పౌర సంబంధాల సమాచార శాఖామంత్రి కాల్వ శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా వాటిని అమలుచేసే విధంగా మార్పులు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  మంత్రి కాల్వను కలిసిన వారిలో  ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్లూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు,
చందు జనార్థన్, కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ఫొటో జర్నలిస్టుల ప్రతినిధి టి. వి.రమణ, జి. రామారావు, పి. మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Tags; In the housing scheme of journalists

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *