Natyam ad

లాస్ట్ నుంచి ఐటీ ర్యాంకింగ్స్ లో

విశాఖపట్టణం ముచ్చట్లు:

 

ఒకప్పుడు ఐటీ అంటే ఏపీ నంబర్ వన్ అనుకునేది ప్రపంచం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు హయాంలో ఐటీ పరుగులు తీసింది. బెంగళూరు చెన్నైలను మించి ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేయడం కోసం ఐటీ పరిశ్రమలు పోటీలు పడేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో బెంగళూరు దిగదుడుపే అన్నట్లుగా ఏపీ పరిస్థితి ఉండేది.ఐటీ ర్యాంకింగ్స్ లో ఏపీ మేటిగా ఉండేది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఐటీ విషయంలో ఏపీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ లో దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు వేసిన పునాదిని అలంబనగా చేసుకున్న తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది.స్టార్టప్స్  ఎకోసిస్టం విషయంలో తాజా ర్యాంగింక్సలో ఏపీ పరిస్థితి ఇది. ఇదొక్కటే కాదు.. ఏ రంగం తీసుకున్నా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పైపైకి వెడుతుంటే.

 

 

ఏపీ మాత్రం కిందకి దిగజారిపోతోంది. తాజాగా విడుదల చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కూడా   గతంలో ఉన్న మెరుగైన స్థానాన్ని ఏపీ కోల్పోయింది.సృజనాత్మకత, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, హ్యూమన్ ఇండెక్స్  ఆంశాల ఆధారంగా ఎంపిక చేసిన ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.  అన్ని రంగాల  సగటును పరిగణనలోకి తీసుకుంటే ఉత్తమ పనితీరు కనబర్చి  ‘బెస్ట్ పర్‌ఫార్మర్ స్టేట్’గా తెలంగాణకు మొదటి స్థానంలో నిలిస్తే.. ఆంధ్రప్రదేశ్  ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.  గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న ఏపీ మూడు స్థానాలు దిగజారిపోయింది.   పలు అంశాలపై నీతి ఆయోగ్, కాంపెటెటివ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తగా 2021 సంవత్సరానికి చేసిన అధ్యయనంలో  ఈ వివరాలు వెల్లడించింది.

 

Post Midle

Tags:In the IT rankings from last

Post Midle