మూడేళ్లలో దేశానికే తలమానికంగా సిరిసిల్ల

 Date:12/01/2019
సిరిసిల్ల ముచ్చట్లు:
ప్రభుత్వ ప్రత్యేక కృషి , చొరవతో  రానున్న 3 సంవత్సరాల లో దేశానికే తలమానికంగా సిరిసిల్ల పట్టణం రూపు దిద్దుకోనుందని జిల్లా కలెక్టర్  వెంకట్రామ రెడ్డి  తెలిపారు. సిరిసిల్ల మున్సిపాలిటి అధ్వర్యంలో   సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ నందు శనివారం  స్వచ్చ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం ,  పతంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, ఎస్పి రాహుల్ హెగ్డే  ముఖ్య అథితులుగా హాజరై పతంగుల పండుగ ప్రారంభించారు . అనంతరం సరదాగా గాలి పటాలను ఎగురువేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో సిరిసిల్ల మున్సిపాలిటి ని మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు . ఇప్పటికే కోట్లాది రూపాయలతో స్థానిక కౌన్సిలర్ ల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు , మౌలిక వసతుల కల్పన కు ప్రాధాన్యం ఇస్తుందన్నారు . రానున్న సంవత్సరాలలో సిరిసిల్ల పట్టణం ను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ఎంత ఖర్చ యిన వెచ్చిచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు . దేశంలో ని ప్రధాన నగరాలూ , మున్సిపాలిటి లలో అత్యత్తమ విధానాలను ఇక్కడ అమలు చేయనున్నట్లు తెలిపారు . సిరిసిల్ల,  వేములవాడ లను అనుసంధానించి పర్యాటక , ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా తీర్చిదిద్దనుందన్నారు .
స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో గత సంవత్సరం సిరిసిల్ల పట్టణం దక్షిణ భారత దేశంలో 5 వ స్థానం పొందడం గొప్ప విషయమన్నారు . ఈ సంవత్సరం స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణం దేశంలో అగ్రగామిగా నిలపలన్నారు , అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు , ప్రజలు , అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు . స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంపై  పాత్రికేయులు విస్తృత ప్రచారం కల్పించి సహకరించాలన్నారు.
ఎస్పి  రాహుల్ హెగ్డే మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంపై పట్టణం ప్రజలు అవగాహన పెంపోందించుకోవాలన్నారు.  పట్టణం ను క్లీన్ గా ఉంచుకోవాలన్నారు . స్వచ్చ సర్వేక్షన్ ప్రజలంతా క్రీయాశీలక భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ , ఎస్పి, జేసి  యాస్మిన్ భాషా, డీఆర్వో ఖీమ్యా నాయక్  లు ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటిలలో విజేతలైన మహిళలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్  సామల పావని , కమీషనర్  రమణా చారి , కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు .
Tags:In the last three years,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *