Natyam ad

ఉద్యోగాల పేరుతో దివ్యాంగుడు లక్షల్లో టోకరా

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఉమ్మడి శ్రీకాకుళం రాజాం మండలం గెడ్డవలసకు చెందిన  దివ్యాంగుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన ముదిలి వెంకటరమణ కోర్టులో పని చేస్తున్నానని చెబుతూ నిరుద్యోగ దివ్యాంగులు కనపడిపడితే మచ్చిక చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసేవాడు.. గత ఐదు సంవత్సరాలుగా దివ్యాంగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అధిక మొత్తంలో గుంజాయించాడు.మజ్జి రాములు అనే మహిళ దివ్యాంగురాలు వద్ద సుమారు 7 లక్షల 50 వేలు చీటింగ్ చేసి డబ్బులు తీసుకున్నాడు. ఇదిగో ఉద్యోగం అదిగో ఉద్యోగం అంటూ మభ్యపెడుతూ ఎట్టకేలకు కటకటాలపాలు అయ్యాడు. ఇలా సుమారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో  దివ్యాంగులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడు. పోలీసులు కేసు నమోదు చేసి 420 చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండు కు తరలించారు.

 

Tags: In the name of jobs, Divyangdu have been robbed of lakhs

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.