పంచాయితీ ఎన్నికలలో బి.సి లను నిలబెట్టాలి

 Date:14/01/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
గ్రామపంచాయితీ ఎన్నికలలో జనరల్ స్థానాలలో బి.సి అభ్యర్థులను నిలబెట్టాలని,  వారిని గెలిపించాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షుడు, ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలోని బిసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ గుర్తులు లేకున్నా ఆయా పార్టీల తరుపున బి.సి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా టిఆర్ఎస్ , కాంగ్రెస్, టిడిపి, బిజేపి, కమ్యూనిస్టు పార్టీలు బి.సి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య పార్టీలకు లేఖలు రాశారు.
బి.సి రుజర్వేశాన్లను తగ్గించినందున బి.సి అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీ ఎన్నికలలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించి అన్యాయం చేశారు. టిఆర్ఎస్ – ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన స్పందించలేదు. గత్యంతరం లేక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామన్నారు. ఇలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆదర – బధరగా ఎన్నికలకు పెడుతున్నందున  గత్యంతరం లేక ఎన్నికలలో జనరల్ స్థానాలలో బి.సి అభ్యర్థులు నిలబడాలని పిలుపునిచ్చారు.
Tags: In the Panchayat Elections, BCs should be placed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *