ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం గుట్టు రట్టు

In the Prakasam district, fake fertilizers are very bad

In the Prakasam district, fake fertilizers are very bad

Date:10/01/2019
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం వెలుగు చూసింది. నకిలీ ఎరువులు అన్నదాతలకు అంటగడుతున్నారని వచ్చిన సమాచారంతో  విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో నకిలీ ఎరువుల వ్యవహారం బట్టబయలైంది. ఉప్పుకి రంగు కలిపి రైతులకు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను సీజ్ చేశారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలో నకిలీ ఎరువులను గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాటి మూలాల కోసం ఆరా తీయగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో భారీగా నిల్వ ఉంచిన నకిలీ ఎరువులను గుర్తించారు. ఎరువుల తయారీలో ప్రముఖ కంపెనీ  ఐపిఎల్ పేరుతో నకిలీ ఎరువులను అన్నదాతలకు అంటగడుతున్నట్టు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఉప్పుకి రంగు కలిపి పొటాష్ పేరుతో రైతులకు అమ్ముతున్నట్టు గుర్తించారు. త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా వందల సంఖ్యలో నకిలీ పొటాషియం ఎరువుల బస్తాలు బయటపడ్డాయి.
ఓ ఇంట్లో ఐపీఎల్ కంపెనీ పేరుతో ఉన్న 624 బస్తాల పొటాష్ ఎరువులను గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటూ ఐపిఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో బస్తాల్లో ఉన్న ఎరువులను పరీక్షించగా నకిలీ అని తేలింది. విజిలెన్స్, వ్యవసాయాధికారులు గ్రామంలోని పలు అనుమానిత ఇళ్లలో సోదాలు చేయగా మొదట 400 బస్తాలు, మరోచోట 84, ఇంకోచోట 140 బస్తాలు బయటపడ్డాయి. ఇవన్నీ త్రిపురాంతకంలోని శ్రీ రాఘవేంద్ర ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ దుకాణం యజమాని శ్యాంసుదర్ గుప్తాకు చెందినవిగా అధికారుల విచారణలో తేలింది. పెద్దమొత్తంలో  నకిలీ ఎరువులు నిల్వ చేయడంపై వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ వ్యాపారం సాగిస్తున్న  కొంత మంది ఎరువుల దుకాణ యజమానులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు. అక్కడి నుండి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలకు నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది.
Tags:In the Prakasam district, fake fertilizers are very bad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *