పుంగనూరులో వైభవంగా జనగణమన గీతం ప్రారంభం

The members of the Jana Committee are PNS Prakash,

The members of the Jana Committee are PNS Prakash,

Date:15/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో తొలిసారిగా పుంగనూరు పట్టణంలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా జనగణమన గీతాన్ని ప్రారంభించారు. జనగణమన కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌ , పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, సివి.శ్యామ్‌ప్రసాద్‌, ఎన్‌.ముత్యాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు , ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు , సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రెడ్డెప్ప, వెహోదలియార్ల సంఘ అధ్యక్షుడు మురుగప్ప , అడిషినల్‌ పిపి ఆకుల చెన్నకేశవులు, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు అమ్ము, ఇనాయతుల్లాషరీఫ్‌, ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ నాయకుడు జయరామిరెడ్డి, రాయలసీమ చిల్డ్రన్స్అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి , జెఏసి చైర్మన్‌ వరదారెడ్డి, సెక్రటరీ నాగేనాయక్‌, వైఎస్సాఆర్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజారెడ్డి, వైఎస్సాఆర్సీపి పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికార్‌ హాజరైయ్యారు. పిడిఎఫ్‌ అధ్యక్షుడు బుక్యా భానుప్రసాద్‌, ఈ సందర్భంగా చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ జాతీయ గీతాన్ని ఆలాపించి, ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు, సీఐ సాయినాథ్‌ , ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు , న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రెడ్డెప్ప, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌లు మాట్లాడుతూ జాతీయ గీతాన్ని పుంగనూరులో ప్రారంభించడం , మదనపల్లెలో అనువాదం చేయడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంతో పుంగనూరు పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు దేశం కోసం 52 సెంకడ్ల పాటు జాతీయ గీతాన్ని ఆలపించి, గౌరవ వందనం చేసి, వెళ్లాలని , దేశ భక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాయలసీమ పాఠశాల విద్యార్థులచే 100 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ హైస్కూళ్ల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు తులసెమ్మ, ఏపివో శ్రీనివాసులు, కౌన్సిలర్లు త్యాగరాజు, మనోహర్‌, దివ్యలక్ష్మి, లలితమ్మ, శోభారాణి, కమలమ్మ, రేష్మ, మంజుల, ఇబ్రహిం, ఆసిఫ్‌, దేశాది ప్రకాష్‌, వ్యాపారుల సంఘ నాయకులు వెంకటాచలపతిశెట్టి, భానుప్రకాష్‌, రాజేష్‌, తెలుగుదేశం నాయకుడు కేశవమూర్తి, ఏపివో సుట్లూరు శ్రీనివాసులు, చందారె డ్డెప్పరెడ్డి, లయన్స్క్లబ్‌ ప్రతినిధులు వెంకటాచలపతిరెడ్డి, ఇంతియాజ్‌, గిరి, కాంగ్రెస్‌ నాయకుడు సజ్జాద్‌, సీఐటియు సెక్రటరీ వెంకట్రమణారెడ్డి తో పాటు జనగణమన కమిటి సభ్యులు నరేంద్రరాజు, కె.రెడ్డిప్రసాద్‌, ఎం.బాబు, కుమార్‌రాజు, శ్రావణ్‌కుమార్‌, వెంకటాచలపతిశెట్టి, మున్సిపల్‌ అధికారులు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు, కార్మికులు పాల్గొన్నారు.

The members of the Jana Committee are PNS Prakash,
The members of the Jana Committee are PNS Prakash,

 

నవ చైతన్యంతో దేశం పురోగమిస్తుంది 

 

Tags: In the Punganuru song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *