2019లో కాంగ్రెస్ పునరుద్ధరణ జరిగితీరుతుంది ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి   కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు 

Date:17/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కాంగ్రెస్ విజయం ఇండియా విజయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. 2019లో కాంగ్రెస్ పునరుద్ధరణ జరిగితీరుతుందని అన్నారు.విలువలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. బీజేపీ అహంకారంతో విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీకి తలవంచే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ నేతృత్వంలో శనివారం ప్రారంభమైన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ, పార్టీ విజయం మన విజయమని, కాంగ్రెస్ విజయమే దేశ విజయమని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌కు పార్టీ అంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.రాహుల్ వెంటే కాంగ్రెస్ ఉంటుందని 2019ఎజెండాను మనం రూపొందించాల్సి అవసరం ఉందని సోనియా గాంధీ అన్నారు. పరిస్థితుల కారణంగానే తాను రాజకీయాలలో వచ్చానని, రెండు దశాబ్దాల పాటు పార్టీ అధ్యక్షురాలిగా తనుక సహకరించిన వారందరికీ కృతజ్ఞతలని సోనియా అన్నారు. కాంగ్రెస్ సభ్యురాలిగా తాను గర్విస్తున్నానని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ జీ మార్గదర్శకం వహించారని, యూపీఏ పాలనలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యామని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ చిక్‌మగ్‌లూరు నుంచి అఖండ విజయం సాధించి దేశానికి సేవలందించారు. త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సోనియా ధీమా వ్యక్తం చేశారు. అందరి ఐక్యత వల్లే పదేళ్లు అధికారంలో ఉండగలిగాం. 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. యూపీఏ-2లో చేసిన అభివృద్ధి వల్లే రెండోసారి అధికారంలోకి రాగలిగామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతి ఒక్కరి విజయంగా భావించాలి. కాంగ్రెస్ క్షీణిస్తున్న దశలో తాను పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆమె స్పష్టం చేశారు. యూపీఏ పథకాలను నీరుగార్చడం మినహా మోదీ సర్కార్ చేసిందేమీ లేదని, పెద్దపెద్ద వాగ్దానాలు చేయడం, నిలబెట్టుకోకపోవడం వారికి పరిపాటిగా మారిందని అన్నారు. కేవలం ఇగోతోనే విభజన రాజకీయాలకు వారు పాల్పడుతున్నారని అంటూ మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ పనితీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రగతి గురించి పనిచేస్తే, అమలుకు నోచని హామీలతో అధికారమే పరమావధిగా కేంద్ర సర్కార్ పనిచేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సోనియా పిలుపునిచ్చారు.మోదీపై సోనియా విమర్శలు చేసినప్పుడు, రాహుల్‌కు అండగా నిలబడాలని కోరినప్పుడు కార్తకర్తలు, నేతలు హర్షధ్వానాలు చేశారు.
Tags:In the year 2019, Congress will be renewed
Each leader, the activist must move forward with confidence
Congress president Sonia Gandhi calls on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *