Natyam ad

టీటీడీ పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడల ప్రారంభోత్సవం.

– టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు   భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

– ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం

తిరుమల ముచ్చట్లు:

Post Midle

 

భ‌గ‌వంతుని సేవ‌లో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో ప‌నిచేసి భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు   భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి కోరారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు శుక్ర‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో ప్రారంభమ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఈవో   ఏవి.ధ‌ర్మారెడ్డి ఉద్యోగుల‌తో క్రీడాప్ర‌తిజ్ఞ చేయించారు. ముందుగా ఛైర్మ‌న్‌, ఈవో క‌లిసి క్రీడాప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. బెలూన్లు, శాంతి క‌పోతాల‌ను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు మార్చ్‌ఫాస్ట్ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛైర్మ‌న్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల‌కు మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించేందుకు, క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తిని పెంచేందుకు ప్ర‌తి సంవ‌త్స‌రం క్రీడాపోటీలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. క్రీడ‌ల‌తో శారీర‌క దారుఢ్యంతోపాటు పున‌రుత్తేజం క‌లుగుతుంద‌ని చెప్పారు. ఉద్యోగుల‌కు క్రీడ‌ల ప‌ట్ల ఉన్న శ్ర‌ద్ధ‌ను గ‌మ‌నించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు రూ.10 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. ఉద్యోగులు మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి క్రీడ‌ల్లో పాల్గొని బ‌హుమ‌తులు గెలుచుకోవాల‌ని కోరారు.

 

 

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ స్నేహలత మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, వారి మాన‌సిక వికాసం కోసం 1977వ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగుల‌కు క్రీడాపోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. గ‌తేడాది 829 మంది పురుషులు, 422 మంది మ‌హిళ‌లు పాల్గొన్న‌ట్టు చెప్పారు. ఈ పోటీల్లో మొద‌టి స్థానం గెలుచుకున్న వారికి రూ.2వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1800/-, మూడో స్థానంలో నిలిచిన‌వారికి రూ.1600/- విలువగ‌ల బ్యాంకు గిఫ్ట్‌కార్డులు బ‌హుమ‌తులు అంద‌జేస్తామ‌న్నారు.

 

 

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్‌, ఈవో వాలీబాల్ ఆడి క్రీడ‌ల‌ను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, ఎస్వీ హైస్కూల్ మైదానం, ఎస్వీ జూనియర్ కళాశాల మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహకిషోర్‌, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ముఖ్య గ‌ణాంకాధికారి  శేష‌శైలేంద్ర‌, సీపీఆర్వో డా.టి.ర‌వి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Tags: Inauguration of annual sports of employees at the parade ground in the TTD administration building.

Post Midle