కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో బాలాలయం సంప్రోక్షణకు అంకురార్పణ

Date:22/01/2021

తిరుపతి ముచ్చట్లు:

కార్వేటినగరం లోని  శ్రీ వేణుగోపాలస్వామివారి ఆల‌యంలో శుక్ర‌వారం రాత్రి  బాలాలయ సంప్రోక్షణకు  శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.  ఇందులో భాగంగా ఉద‌యం 10 గంట‌ల‌కు రుత్విక్‌ వరణం(ఆచార్య‌వ‌ర‌ణం)తో శ్రీ వేణుగోపాలస్వామివారి ఆల‌యంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఆల‌యంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. కాగా, జ‌న‌వ‌రి 23న శ‌ని‌వారం ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని శ్రీ వేణుగోపాల‌స్వామివారి మూల‌మూర్తి శ‌క్తిని కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌లో ప్ర‌తిష్టించి ఆరాధ‌న‌లు చేప‌డ‌తారు.

 

 

జ‌న‌వ‌రి 24వ తేదీల‌లో ఉద‌యం 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, , క్షేరాధివాసం, జలదివాసం నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, సయనాధివాసం చేప‌డ‌తారు.    జ‌న‌వ‌రి 25వ తేదీ ఉదయం 8.30 నుంచి 10 గంటల మధ్య కుంభ‌ లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో   పార్వ‌తి, కంక‌ణ‌బ‌ట్టార్   సీతారామాచార్యులు, ఏఈవో   దుర్గ‌రాజు, సూప‌రిండెంట్  ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  కుమార్, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Inauguration of Balalayam Samprokshan at Sri Venugopalaswamy Temple, Corvette

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *