Natyam ad

విశాఖలో ఫ్రెంచ్ ఇమెరీస్ ఫ్యాక్టరీ ప్రారంభం

-ఉత్పత్తి కేంద్రం ప్రారంభించిన ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యూల్ లైనిన్

-1000 మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు

 

విశాఖ ముచ్చట్లు:

Post Midle


పారిశ్రామిక ఖనిజ ఆధారిత స్పెషాలిటీ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఇమెరిస్ సంస్థ విశాఖపట్నంలో నూతన ఉత్పత్తి కేంద్రం ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటి ఇమెరిస్ ప్లాంటును ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యూల్ లైనిన్ అచ్యుతాపురం సెజ్ లో బుధవారం నాడు ప్రారంభించారు. ఇమెరీస్ సంస్థ తన ఉత్పత్తి ప్లాంటును గత ఏడాది నుంచి సెజ్ లో నిర్మిస్తోంది. ఫ్రెంచ్ దేశానికి చెందిన ఈ కంపెనీ అల్లుమినినేట్ బైండర్ ఉత్పత్తిని చేపడుతుంది. ఉత్పత్తి కేంద్రంతో పాటు పరిశోధన, అభివృద్ధి, సుస్థిరత ప్రయత్నాలను భారత్ లో మరింత వేగవంతం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. రూ. 350 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సంస్థలో వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇమెరీస్ సంస్థ ప్రపంచ వ్యాప్త పెట్టుబడుల్లో విశాఖలోని ఉత్పత్తి కేంద్రం కీలకంగా మారనుంది. ఇతర దేశాల్లోకి కంపెనీలకు ఇక్కడి నుంచే ముడి అల్యూమినేట్ సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఉత్పత్తి ప్లాంటును ప్రారంభించిన అనంతరం భారత దేశంలోని ప్రెంచ్ రాయబారి ఇమాన్యుయెల్ లైనిన్, ఇమెరిస్ మేనేజింగ్ డైరెక్టర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మాట్లాడుతూ, ” ఇక్కడి ఉద్యోగుల్లో 95 శాతం మంది స్థానికులే. స్థానిక మార్కెట్ల అవసరాలను తీర్చడంపై ఎక్కువ ఉత్పత్తి చేపట్టనున్నారు. ప్లాంట్లో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

 

 

ఇమెరిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెగి ఇడికులా మాట్లాడుతూ, “దేశంలో పెరుగుతున్న ఉక్కు, సిమెంటు, ఇత‌ర మెట‌ల‌ర్జిక‌ల్ ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాలు తీర్చ‌డానికి రిఫ్రాక్ట‌రీలు, ఇత‌ర అధిక ఉష్ణోగ్ర‌త మెటల్ డిమాండ్ ను తమ ప్లాంట్ తీర్చనుంది. విశాఖపట్నం నగరానికి అద్భుత‌మైన ఓడ‌రేవు క‌నెక్టివిటీ ఉంది. వాణిజ్యానికి అనుకూల‌మైన వాతావరణం ఉండటంతో విశాఖ దేశంలోనే ప్రముఖమైన పారిశ్రామిక కేంద్రంగా మారింది. దేశ అవసరాలను తీర్చడంతో పాటు విదేశీ ఎగుమతులకు అధిక ప్రాధాన్యత లభించనుంది. దేశీయ ఉక్కు, సిమెంట్ రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 2030 నాటికి ప్లాంట్ సామర్థ్యాన్ని 50 వేల టన్నులకు విస్తరించనుంద”ని ప్రకటించారు.

 

Tags: Inauguration of French Emery Factory in Visakha

Post Midle