మాతా శిశు ఆరోగ్యకేంద్రం ప్రారంభం

-హజరయిన మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి
 
వనపర్తి ముచ్చట్లు:
 
వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తరువాత సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసార. ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు, వైద్యఆరోగ్య మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , కమీషనర్ వాకాటి కరుణ , గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , డీఎమ్ఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ , డీఎం & హెచ్ ఓ, తదితరులు హజరయ్యారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నాను. రహదారుల విస్తరణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నది. సిద్దిపేటలో ఒక్క సుభాష్ రోడ్ విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు .. దానికి ఏడాదిన్నర సమయం పట్టింది. వనపర్తిలో ఆరు రహదారులు నాలుగు లేన్లుగా విస్తరణ అంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. మంత్రి నిరంజన్ రెడ్డి కృషి అభినందనీయం. కేసీఆర్ ఆశీస్సులు, నా సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వ ఆసుపత్రులలో 54 శాతం కాన్పులు పెరిగాయి. దేశంలో తెలంగాణ ఉత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం గుర్తించింది.
 
 
 
 
రాష్ట్రంలో రూ.407 కోట్లతో 23 ప్రసూతి ఆసుపత్రులు, 30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం జరిగాయి. పుట్టిన పిల్లల కోసం ఎస్ఎన్ సీయూ .. 18 ఎస్ఎన్ సీయూ కేంద్రాలను ఏడేళ్లలో 65 కి పెంచాం. శిశుమరణాలను 25 శాతం నుండి 16 శాతానికి తగ్గించాం .. జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపు, ప్రణాళికతో  ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. కాంగ్రెస్ , టీడీపీ పాలనలో అభివృద్ది కుంటుపడింది. కేసీఆర్ పాలనలో పాలమూరు అభివృద్ది .. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 5 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. రూ.1500 కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని అన్నారు.మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 330 పడకలతో వనపర్తి జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. కేసీఆర్ అశీస్సులు, హరీష్ రావు సహకారంతో వనపర్తి పచ్చబడింది. వందేళ్లయినా సాగునీళ్లకు ఢోకాలేదు. బతుకుదెరువుకు భరోసానిచ్చారు. ఆరోగ్యం, ఆర్థికం హరీష్ రావు చేతుల్లో ఉన్నాయి. వనపర్తి అభివృద్దికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు.
దాడులను అరికట్టాలి
Tags:  Inauguration of Mata Shishu Health Center