పుంగనూరులో రూ.1.20 కోట్లతో నిర్మించిన శ్రీఅర్కేశ్వరస్వామి ఆలయ ప్రారంభ పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని దండుపాళ్యెం రోడ్డులో శ్రీ ప్రసన్న అర్కేశ్వరస్వామి పార్వతిదేవి ఆలయాన్ని సుమారు రూ.1.20 కోట్ల సొంత నిధులతో ఆలయ ధర్మకర్త ధర్మరాజు, ఆయన సతీమణి కుమారి దంపతులు నిర్మించారు. పూర్తిగా రాతితో అత్యంత సుందరంగా మలచబడిన ఆలయ ప్రారంభ పూజలు 29న ప్రారంభంకానున్నాయి. జూలై 1న స్వామివార్లు ,వినాయకుడు, కాలబైరేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలను శృంగేరికి చెందిన పండితులచే హ్గమాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ధర్మరాజు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని, స్వామివారి కృపకుపాత్రులుకావాలెనని కోరారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Inauguration of the Sri Arkeshwaraswamy Temple at Punganur, built at a cost of Rs. 1.20 crores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *