Natyam ad

శ్రీ మేధా గురు దక్షిణామూర్తి వద్ద గోడపత్రిక ను ఆవిష్కరణ

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

శ్రీ కనకాచలముపై వెలసియున్న శ్రీ కనకదుర్గాంబ అమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవములు గోడ పత్రిక ను ఆవిష్కరణ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు . శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన శ్రీ కనకాచలముపై వెలసియున్న శ్రీ కనకదుర్గాంబ అమ్మవారి దేవి దసరా నవరాత్రి సందర్భంగా శ్రీ మేధా గురు దక్షిణామూర్తి వద్ద గోడపత్రిక ను ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు పాల్గొని గోడ పత్రిక ను ఆవిష్కరణ చేశారు. ముందుగా గురు దక్షిణామూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

 

 

 

Post Midle

అనంతరం దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన శ్రీ కనకాచలముపై వెలసియున్న శ్రీ కనకదుర్గాంబ అమ్మవారి దేవి నవరాత్రి 15-10-2023 నుండి 23-10-2023 వరకు అతి వైభవంగా కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారని తెలియజేశారు. ముఖ్యంగా ఎండలు తీవ్రతలు ఉన్నదానివల్ల కొండకు వచ్చే భక్తుల కోసం మెట్ల పైన కూలింగ్ పెయింటింగ్ ను కూడా వేయించినట్లు తెలియజేశారు. అదేవిధంగా చలవ పందిర్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. మహిళ భక్తుల కోసం ఇటువంటి ఇబ్బంది కరంగా లేకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతం ప్రజలు దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు రమాప్రభ, ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి పండు, జూలకంటి సుబ్బారావు, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, ఏఈఓ ధనపాల్, సతీష్ మాలిక్, లోకేష్ రెడ్డి,టెంపుల్ సూపర్డెంట్ శ్రీహరి, నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, దేవస్థాన సిబ్బంది సుదర్శన్ రెడ్డి, సుధాకర్, పసుపులేటి కామేశ్వరరావు, పట్టణ ప్రముఖులు కొండూరు నంద వెంకటసుబ్బయ్య, గిరి ప్రసాద్ గౌడ్, మరియు దేవస్థానం అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Inauguration of wall scroll at Shri Medha Guru Dakshinamurthy

Post Midle