పుంగనూరులో రాతిమసీదు కమిటి చైర్మన్‌గా ఇనాయతుల్లాషరీఫ్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని అతిపురాతనమైన రాతిమసీదు కమిటి చైర్మన్‌గా ఇనాయతుల్లాషరీఫ్ను నియమిస్తూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం తిరుపతిలో నియామకపు ఉత్తర్వులు అందజేశారు. కమిటి మెంబర్లుగా నజీర్‌బాషా, బాబుఫకృద్ధిన్, అంజాద్‌బాషా, యూసఫ్, ఎల్.ఫకృద్ధిన్సాహెబ్, న్యామతుల్లాషరీఫ్, నూర్‌బాషా, అహమ్మద్‌హుసేన్, ఖాదర్‌వల్లి, జావీద్‌లను నియమించారు. మంత్రి పెద్దిరెడ్డికి విధేయుడు , సున్ని అంజుమన్ కవిటటి అధ్యక్షుడుగా ఉన్న ఇనాయతుల్లాషరీఫ్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాతిమసీదు అభివృద్ధికి ఎంతో సేవలు అందించారు. మైనార్టీలలో అజాతశత్రువుగా పేరుగాంచిన ఇనాయతుల్లాషరీఫ్ను మంత్రి పెద్దిరెడ్డి, వక్ఫ్‌బోర్డు ద్వారా కమిటి అధ్యక్షుడుగా నియమించడం పట్ల పట్టణ ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇనాయతుల్లా షరీఫ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో మసీదు పదవి ఇప్పించినందుకు కృతజ్ఞత లు తెలిపారు. మసీదును అన్నివిధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Tags: Inayatullah Sharif as the Chairman of the Rathi Masjid Committee in Punganur
