క్రికెట్ కోచ్ లకు ప్రోత్సాహలు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

సోమ వారం నాడు  హెచ్సిఎ నిర్వహించిన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆటగాళ్లకు ఉచిత టీకాలు వేసే కార్యక్రమానికి ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.  మంత్రి మాట్లాడుతూ హెచ్ సి ఏ క్రికెట్ ను జిల్లాలలో కూడా అభివృద్ధి చేయాలి. గొప్ప క్రీడాకారులు వున్నారు తెలంగాణ రాష్ట్రంలో. హెచ్ సి ఏ పై వస్తున్న ఆరోపణలు అన్ని సర్దుకుంటాయి .. సమస్యలు పరిష్కారం అవుతాయి.  క్రీడాకారులకు  పైరవీలు అవసరం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు దేశానికి పేరు తేవాలి. ముఖ్యమంత్రి  కేసీఆర్ అధ్యక్షతన  క్రీడా సబ్ కమిటీ వేసాం.
అనేక క్రీడా పాలసీలు  వస్తున్నాయి. హెచ్ సి ఏ ను ఆహ్వానిస్తాము. సిఎం కేసిఆర్ క్రీడలు అభివృద్ధి చేసేందుకు పాలసీలు రూపొందిస్తున్నారు. క్రికెట్ కోచ్ లను ప్రోత్సహిస్తాం.  క్రికెట్ గేమ్ కు మంచి క్రేజ్ వుందని అన్నారు.హెచ్ సి ఏ సెక్రెటరీ విజయ ఆనంద్  మాట్లాడుతూ కేటిఆర్ చొరవతో వాక్సినేషన్ ఏర్పాటు చేశారు. అందుకు కేటిఆర్ కి శ్రీనివాస్ గౌడ్  కు కృతజ్ఞతలు. 7నుండి హెచ్ సి ఏ  లీగ్ స్టార్ట్ కాబోతుంది. లీగ్ స్టార్ట్ కాకముందు క్రీడాకారులకు స్పోర్ట్స్ స్టాఫ్ కు వాక్సిన్ వేయాలని గైడ్ లైన్స్ వున్నాయని అన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Incentives for cricket coaches

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *