మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వలన తిరుపతి జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు

తిరుపతి ముచ్చట్లు:

మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వలన తిరుపతి జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు, భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణ రెడ్డి గారు అధికారులకు పలు ఆదేశాలు సూచనలు చేశారు.

🌼మిచౌంగ్ తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధం : కలెక్టర్

🌼సచివాలయ, గ్రామ, మండల, మునిసిపల్ స్థాయిలోని అధికారులందరూ పనిచేసే చోటే అందుబాటులో ఉండాలి : కలెక్టర్

🌼జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యం తగదు : కలెక్టర్

🌼ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు… ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండండి : కలెక్టర్

🌼 పాత మట్టి మిద్దెలు, పూరి గుడిసెల లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు/ పునరావాస కేంద్రాలకు తరలింపుకు చర్యలు కొనసాగుతున్నాయి: కలెక్టర్

🌼 పది రోజుల్లో ప్రసవం కానున్న గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించడం కొరకు చర్యలు చేపట్టాం: కలెక్టర్

🌼ఎక్కడైనా ఇళ్లలోకి నీరు ప్రవేశిస్తే ఆ కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించండి : కలెక్టర్

🌼జిల్లాలోని అన్ని ప్రధాన చెరువుల వద్ద పర్యవేక్షణకు అధికారులను నియమించాం : కలెక్టర్

🌼ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలి: కలెక్టర్

🌼 రెవెన్యూ డివిజన్లు లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్లు

శ్రీకాళహస్తి…. 9704161120
సూళ్లూరుపేట. 9490739223
గూడూరు .. 08624 252807
తిరుపతి .. 9491077012
 

Tags: Incessant rains in Tirupati district due to the impact of Cyclone Michoung

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *