బీజేపీలో చేరికలు

రంగారెడ్డి  ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని కోత్తుర్ తండా కి చెందిన గిరిజన యువకులు బీజేపీ పార్టీ కొత్తూరు  మండల అద్యక్షులు మల్ రెడ్డి మహేందర్ రెడ్డి, నాగరాజ్ చారి అధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్  నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,అందే బాబయ్య ,దేపల్లి అశోక్ గౌడ్,చెంది మహేందర్ రెడ్డి,అండాపురం నర్సింహ్మ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా బీజేపీ పార్టి సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..నీళ్ళు నిధులు నియామకాలు పెరుతో సాదించుకున్న తెలంగాణ రాష్ట్ర లో నియామకాల ప్రక్రియను ఇప్పటి వరకూ ప్రారంభించాకుడా కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చెయ్యడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు యువకులు పోరాడి సాధించినా రాష్ట్రంలో యువతకి నియామకాల బర్తీ చెయ్యకుండా వారిని మోసంచేశారన్నారు. తెలంగాణ ద్రోహులను సంకలో పెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చి రాచరిక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ఉచిత ప్రగల్బాలు పలికిన మన ముఖ్యమంత్రి కి  2023 లో తెలంగాణ యువత తెరాస ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. పార్టీ లో చేరిన వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. అందే బాబయ్య  మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడినా రాష్ట్రంలోయువత ఉద్యోగాల కోసం ఎదురు చూపు తప్ప వారికీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అని చెప్పి ఇప్పటి వరకూ ఇవ్వకుండా మోసం చేస్తున్న కేసిఆర్ కి యువకులు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. అశోక్ గౌడ్ మాట్లడుతూ  బిజేపి సామాన్య కార్యకర్తల పార్టి అని అన్నారు.  బిజేపి పార్టి ఒక సామాన్య చాయ్ వాలా నీ దేశ ప్రధాని చేసినా ఘనత బిజేపి దే నన్నారు. చెంది మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసినా ప్రతి ఒక్కరినీ పార్టి గుర్తిస్తుంది అని అన్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాణిక్యం, కురుమన్న రణదిర్ శేకర్ గణేష్ శివా కుమార్,  సూర్య చత్రు నాయక్, సత్తి ముదిరాజ్, బాల స్వామి, అవినాష్ పటక్శివకుమార్, నవీన్ కుమార్, ఇమ్రాన్, మల్లేశ్, నరేష్, హరీష్ కొండారెడ్డి, సురేందర్, రాజు నరేష్ హరీష్ తదితరుల పాల్గోన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Inclusions in the BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *