ఆదాయపన్ను పరిమితి 7 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. తన బడ్జెట్ ప్రసంగంలో వేతన జీవులకు భారీ ఊరటనిచ్చారు. ప్రస్తుతం ఉన్న 5 లక్షల ఆదాయపు పన్ను పరిమితిని 7 లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇది కొత్తపన్ను విధానంలో ఉన్నవారికే వర్తించనున్నట్లు నిర్మల పేర్కొన్నారు.ఆదాయం 7 లక్షలు దాటితే మాత్రం అయిదు శ్లాబులలో పన్ను చెల్సించాల్సి ఉంటుంది.. రూ.15 లక్షలు ఆదాయం ఉన్నట్లయితే ఏకంగా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా,ఏడు లక్షలు దాటితే రూ.3 లక్షల నుంచే పన్ను చెల్లించాలి.. మూడు నుంచి 6 లక్షలవరకు అయిదు శాతం, అరు నుంచి 9 లక్షల వరకు 10 శాతం, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 20 శాతం, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాల్సివుంటుంది.అలాగే, సీనియర్ సిటిజన్స్లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితి పెంచారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని రూ.30లక్షలకు పెంచుతున్నామని మంత్రి వెల్లడించారు.
Tags: Income tax limit increased to 7 lakhs

