Natyam ad

పుంగనూరులో విద్యుత్‌ వినియోగంపై అవగాహన పెంచుకోండి -ఎస్‌ఈ కృష్ణారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలు విద్యుత్‌ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని ఏపిఎస్‌పిడిసిఎల్‌ ఎస్‌ఈ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని జెఎండి కళ్యాణ మండపంలో ప్రజలకు విద్యుత్‌ వినియోగంపై అవగాహన సదస్సుకు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఈఈ విజయన్‌, డీఈఈ రవికుమార్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్‌ వినియోగం, ఉపయోగం, ఖర్చు తదితర అంశాలపై డిజిటల్‌ స్కీన్‌ద్వారా ఎనర్జీ అడిటర్‌ శశిధర్‌తో కలసి వివరించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగంపై వివరించారు. భారతదేశంలో 82 శాతం ఆయిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే 75 శాతం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. సహజవాయువు 45 శాతం దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. సహజవాయువు అధిక వినియోగంతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందన్నారు. దీని ప్రభావం మానవాళిపై పడే అవకాశం ఉందన్నారు. భూమి అధికంగా వేడేక్కుతోందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా అత్యంత వేడి ఉందన్నారు. ఉష్ణోగ్రత, వర్షపాతంలో మార్పులు వెహోత్తం సమాజంలో ఉంద న్నారు. వీటిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు విద్యుత్‌ ఎప్పుడు అవసరమో అప్పుడే వినియోగించడం, నాణ్యమైన మోటార్లు , వైర్లు వాడటం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఈలు ధనుంజయమూర్తి, వెంకట్రమణ, రాజశేఖర్‌, రైతులు చంద్రారెడ్డి యాదవ్‌, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రవిశంకర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, నంజుండప్ప తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; Increase awareness on electricity consumption in Punganur – SE Krishna Reddy

Post Midle