పోస్టాఫీసులో వడ్డీ రేట్లు పెంపు

Increase Interest Rates in Post Office

Increase Interest Rates in Post Office

Date:20/09/2018
ముంబై ముచ్చట్లు:
సామాన్యుడికి కేంద్రం ఊరటనిచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ గురువారం మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయం కారణంగా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఎసీ), పోస్టాఫీస్ టైం డిపాజిట్లపై అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
చిన్న మొత్తాల పథకాల వడ్డీ రేట్లను 30-30 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్టు (ఒక్క శాతం 100 బేసిస్ పాయింట్లకు సమానం) ఆర్థిక శాఖ వెల్లడించింది. పోస్టల్ సేవింగ్స్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకాలు, పీపీఎఫ్‌లలో తాజా పెట్టుబడులు దాదాపుగా లేవని ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జనవరి-మార్చి త్రైమాసికానికి వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్థిక శాఖ.. గత రెండు త్రైమాసికాల్లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తాజాగా అమల్లోకి వచ్చిన ఆర్థిక శాఖ ఉత్తర్వులతో ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి 6.9 శాతం, 7 శాతం, 7.2 శాతం చొప్పున డిపాజిట్లపై ఇండియా పోస్ట్ వడ్డీ రేట్లను అందించనుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలకు వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచారు.
దీంతో ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికి వరుసగా 8 శాతం, 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నారు. ఐదేళ్ల కాలపరిమితితో ఉన్న సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్‌లో అక్టోబర్ 1 నుంచి 8.7 శాతం వడ్డీ చెల్లిస్తారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కోసం ఏడాదికి 8 శాతం, కిసాన్ వికాస్ పత్రాలకు 7.7 శాతం చొప్పున వడ్డీ రానుంది.
Tags:Increase Interest Rates in Post Office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *