Increase speed in employment tasks

ఉపాధి పనుల్లో వేగం పెంచండి

#నీటి సమస్య రానివ్వదు
#ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆదేశం

Date:23/05/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

తంబళ్లలపల్లె నియోజకవర్గం లో ఉపాధి హామీ పథకం పనుల వేగం పెంచాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆదేశించారు. ఇవాళ మండల పరిషత్ కార్యాలయంలో అందుబాటులోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 14 గ్రామపంచాయతీలో పనులపై ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నామని చెప్పారు. ఉపాధి సిబ్బంది తో పాటు గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులకు ఉపాధి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉపాధి పనుల్లో అమలులో తంబళ్ళపల్లె రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. మరిన్ని పనులు కల్పించడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులను కోరారు. ఎక్కడ కానీ తాగునీటి సమస్య ఉండకూడదని పేర్కొన్నారు. సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మహానేత రాజన్నకు ఘన నివాళులు

Tags; Increase speed in employment tasks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *