ఉపాధి కూలీల సంఖ్య పెంచండి

Increase the number of employment wages

Increase the number of employment wages

Date:12/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీడీవో లక్ష్మీపతి అన్నారు. మండలంలోని రాగి మా కుల పల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 207 గ్రూపులకు చెందిన 975 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. కూలీల సంఖ్య ను 1200 పెంచాలని ఆయన సూచించారు. ప్రస్తుతం చెరువులలో నీటి కుంటలు, చేపల పెంపకానికి కుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పొలాల వద్ద ఫాం పాండ్స్ తవ్వకాలతో పాటు మామిడి, అల్లనేరేడు మొక్కల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా గుట్టల చుట్టూ నీటి నిల్వ కందకాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. పెడ్రసు పల్లి పెద్ద చెరువు లో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం వూలపాడు పంచాయితీలో హౌసింగ్ అవుట్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఎపిఓ గౌరీ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.

 

జనవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

 

Tags:Increase the number of employment wages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *