ఆలయానికి  పెరిగిన ఆదాయం…

మద్దికేర ముచ్చట్లు:

మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో వెలసిన శ్రీభూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి ఆలయానికి లక్షా నలభై ఎనిమిది వేల రూపాయల ఆదాయం పెరిగిందని ఆలయ కార్యనిర్వాహనాధికారి చంద్రశేఖర్ రెడ్డి,పాలక మండలి అధ్యక్షుడు దస్తగిరి గౌడ్ లు తెలిపారు. గురువారం ఆలయ పరిధిలోని కాలక్షేప మండపంలొ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదోని డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో
2024 జనవరి ఒకటి నుండి 2024 డిసెంబర్ ముప్పై ఒకటి వరకు టెంకాయలు, తమలపాకులు అమ్ముకొనేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించారు.వేలం పాట ను దక్కించుకునేందుకు ఎనిమిది మంది పోటా పోటీ పడ్డారు.చివరకు బాల్యం రవి పది లక్షల యాభై ఐదు వేలరూపాయలకు వేలం పాట దక్కించుకున్నాడు.గత ఏడాది నిర్వహించిన వేలం పాట తొమ్మిది లక్షల ఏడు వేల రూపాయలని,గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లక్షా నలభై ఎనిమిది వేల రూపాయలు పెరిగిందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోమండూరి రంగనాథాచార్యులు బృందం, పాలకమండలి సభ్యులు లక్ష్మీరెడ్డి,చిన్న పక్కిరప్ప,జర్రప్ప,నాగన్న,ఆలయ సిబ్బంది పలువురు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags;Increased income for the temple…

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *