పెరిగిన పంచాయితీలు ఎన్నికల సమయానికి కష్టమే

Date:16/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
Increased panchayats are difficult to find during election time
Increased panchayats are difficult to find during election time

ఉండగా వాటిలో పూర్తిగా ఎస్‌టిల పంచాయతీలు 1326, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలు 1311కాగాఇతర పంచాయతీలు10,114 ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం 300జనాభాలోపు ఉన్న పంచాయతీలలో 5 వార్డులు, 300 నుంచి 500లలోపు ఏడు వార్డులు ఉండాలి.500నుంచి 1500 లలోపు 9,1500 నుంచి 3000లలోపు 11,3000 నుంచి 5000లలోపు13,5000 నుంచి 10000లలోపు15వార్డులను ఏర్పాటుచేయా లి.ఈ లెక్కన మొత్తం వార్డుల సంఖ్య1,13,270 వార్డులు ఏర్పడుతాయని ఒక అంచనాకు వచ్చారు. వీటిని ఖరారు చేసిన తర్వాత పంచాయతీలు, వార్డుల వారీగా బిసిల గణన జరగాలి. ఇది ప్రారంభిస్తే పూర్తవడానికి కనీసం నెలరోజులు సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.అనంతరం పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాలి. దీనికి కనీసం మరో పక్షం రోజులు పడుతుందంటున్నారు. దీనిని ప్రకటించిన అనంతరం అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇస్తారు. అనంతరం రిజర్వేషన్ల తుది జాబితా ఖరారు చేస్తారు. వార్డుల విభజన,ఈ జాబితాలను ఎన్నికల సంఘానికి పంపుతారు. ఇవి ఎన్నికల సంఘానికి చేరగానే వారు పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. మరో వైపు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త చట్టం నోటిఫికేషన్ జారీ అయి గెజిట్ వస్తే తప్ప ఏర్పాట్లు చేయడానికి ముందుకుపోయే పరిస్థితి లేదు. జూలై 31లోపు ఎన్నికలు జరపాలంటే మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపు కొత్త చట్టం అమల్లోకి రావడం, ఎన్నికల ప్రక్రియలన్నీ చకచకా జరిగిపోవడం సా ధ్యం కాకపోవచ్చని పంచాయతీరాజ్ శాఖాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారని, పంచాయతీల సంఖ్య పెరిగిందని ఇది కూడా కొంత జాప్యం కావడానికి కారణం అయ్యే అవకాశాలుఉన్నాయన్నారునిజానికి చట్టం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వెలుబడ్డా యి.  ఎప్పుడు అమల్లోకి తెస్తారనే విషయం కూడా అధికారులకు సమాచారం లేదు. ముఖ్యమంత్రి మాత్రం ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కొత్త పంచాయతీరాజ్ చట్టంపై చర్చ సందర్భంగా ఎన్నికలను గడువులోగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కారణం పంచాయతీల సంఖ్య గణనీయంగా పెరిగి 12,751కి చేరింది. పాత పంచాయతీలలకు అనుబంధంగా ఉన్న గ్రామాలు కొన్ని కొత్త పంచాయతీలుగా మారాయి.ప్రస్తుత పంచాయతీల పాలకవర్గం గడువు ఈ ఏడాది జులై 31తో ముగుస్తుం ది. రాజ్యాంగం ప్రకారం ఆగస్టు 1న కొత్త పాలకవర్గం కొలువుదీరాలి. నిబంధనల మేరకు తప్పని సరిగా గడువులోపే ఎన్నికలు జరగాలి. ఎవరైనా అభ్యంతరాలు తెలుపుతూ కోర్టుకు వెళ్ళడం, స్టే తీసుకురావడం వంటివి జరిగితేనే ఎన్నికలను వాయిదా వేసి పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తారు. ఎలాంటి అవాంతరాలు లే కుంటే మాత్రం ఎన్నికలను గడువు తర్వాత జరపడానికి వీల్లేదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఇలాంటివేమీ చోటు చేసుకోలేదు. కాబట్టి గడువులోపే జరిపితీరాలి. దీని కోసం ఏర్పాట్లు చేయడానికి పంచాయతీరాజ్,కొత్తగా తండాలుపంచాయతీలుగా మారాయి. అం టే పాత లెక్కలు చూసి వార్డులు, రిజర్వేషన్లు, పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ సామగ్రి వంటివి నిర్ణయించే పరిస్థితి లేదు. అన్ని వ్యవహారాలు ఈ సారి కొత్తగా చేయాల్సిందే..ఎంత త్వరగా చట్టం అమల్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నామని,అది ఆలస్యమైనా కొద్దీ ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టడంలోనూ జాప్యం అవుతోందని వా ఖ్యానించారు. ఈ ప్రక్రియ వ్యవహారం ఇంతగా ఉండడంతో గడువులోపు ఎన్నికల నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇప్పటికే ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముందస్థు ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టింది.సర్పంచి, వార్డు సభ్యుని కి కలిపి ఒకే బ్యాలట్ బాక్స్ ఉంటుంది. ఇప్పటికే వచ్చిన అంచనా మేరకు1,13,270 వార్డులు ఉండనున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే 1,13,270 బ్యాలట్ బాక్స్‌లతో అదనంగా మరో 15వేల వరకు బ్యాలట్ బాక్స్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి.రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల బ్యాలట్ బాక్స్‌లు ఉన్నాయి. కర్ణాటక నుంచి 40 వేలు, మహారాష్ట్ర నుంచి 33వేలు బ్యాలెట్ బాక్స్‌లు తెప్పించారు. దీంతో మొత్తం 98వేల బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల సంఘం సమకూర్చుకుంది. పం చాయతీ ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

Tags:Increased panchayats are difficult to find during election time

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *