సర్కార్ దవాఖానా ల్లో పెరిగిన ప్రసవాలు

Increased transmissions in government hospitals

Increased transmissions in government hospitals

 Date:15/03/2019
నల్గొండ ముచ్చట్లు:
కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ దవాఖానల్లో సకల సదుపాయాలు కల్పించడంతో గర్భిణులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య ప్రతినెలా పెరుగుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన పరికరాలు, పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది, సరిపడా మందులు కల్పిస్తున్న నేపథ్యంలో వివిధ వ్యాధులతో వచ్చే వారితో పాటు గర్భిణులు, బాలింతలు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఓపీ సంఖ్య కూడా పెరిగింది. గతంలో ప్రసవాల కోసం ప్రభుత్వం దవాఖాలకు వెళ్లేందుకు మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు వెనుకాడేవారుగత ఏడాది ఏప్రిల్ నుంచి జనవరి 2018 వరకు ప్రైవేటులో తగ్గుముఖం పట్టి సర్కార్ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. నల్గొండ జిల్లా కేంద్ర దవాఖానతో పాటు మూడు ఏరియా ఆస్పత్రులు, 6 కమ్యూనిటీ న్యూట్రిషన్ హెల్త్ సెంటర్లు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఒక అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(12గంటల సేవలు), 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (24గంటలు సేవలు), 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, 257 సబ్ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు.
దీంతో పాటు వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్ర అసుపత్రితోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్‌లో రోజుకు వెయ్యి మంది వరకు ఔట్ పెషెంట్లు, ఇన్‌పెషెంట్లుగా చికిత్సలు పొందుతున్నారు. సర్కారు దవాఖానల్లో వైద్యం మెరుగుపర్చేందుకు ప్రభుతం తీసుకున్న చర్యల ఫలితంగా వాటికి వచ్చే రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఒకప్పుడు ప్రసవాలు ప్రైవేటు దవాఖానల్లో అధికంగా జరిగేవి. కానీ ప్రస్తుతం అక్కడ తగ్గుముఖం పట్టగా ప్రభుత్వ దవాఖానల్లో వీటి సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాల్లో భాగంగా సర్కారు దవాఖానలో డెలివరీ అయి ఆడ శిశువు పుడితే రూ. 13 వేలు, మగ శిశువు పుడితే రూ. 12 వేలు సదరు మహిళ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేస్తున్నది. దీంతో పాటు డెలివరీ అయిన రోజునే రూ. 2 వేల విలువైన శిశువు, తల్లికి సంబంధించిన 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను ప్రభుత్వం అందజేస్తున్నది. దీంతో పాటు గర్భిణులను దవాఖానకు తరలించేందుకు, డెలివరీ తర్వాత వారికి ఇంటికి చేరవేసేందుకు ఉచితంగా వాహనాలను కూడా ప్రభుత్వం సమకూర్చింది. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తుండటంతో జిల్లా ఆసుపత్రితో పాటు మండలాల పీహెచ్‌సీ కేంద్రాల్లో కూడా నెల నెలా ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది.
గర్భిణులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రస్తుతం పేద, మధ్య తరగతి తేడా లేకుండా మెరుగైన సేవలు అందించడం విశేషం. జిల్లాలో ఇప్పటి వరకు 8450 కేసీఆర్ కిట్లు రాగా 8136 కిట్లు మంజూరు చేసి 7542 కిట్లు నిరుపేదలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బ్లడ్ కంపోనెంట్ సఫరేట్ పరికరం ద్వారా డెంగ్యూ ఇతర విష జ్వరాలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఏరియా దవాఖానల్లో కూడా డిజిటల్ ఎక్స్‌రే ఏర్పాటు చేయడం ద్వారా రేడియో గ్రాఫిక్స్ యూనిట్లను ఆధునీకరించారు. దీంతో పాటు టెలీ రేడియాలజీ సౌకర్యం కల్పించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మిర్యాలగూడ, నల్లగొండలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మరో 40 లక్షల రుపాయలతో వెల్‌నెస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు జిల్లా కేంద్ర దవాఖానలో రూ. 80 లక్షలతో మౌలిక సదుపాయలు కూడా కల్పిస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 18081 ప్రసవాలు జరుగగా అందులో ప్రభుత్వ దవాఖానాల్లో 8603, ప్రైవేటులో 9478 జరిగాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 25శాతం మాత్రమే ప్రసవాలు జరగగా నేడు అవి 53శాతారనికి చేరాయి. గతంలో పీహెచ్‌సీలకు గర్భినులు రాని పరిస్థితి నుంచి ప్రస్తుతం ప్రతినెలా 10 నుంచి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి.
జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రితో పాటు, దేవరకొండ, నకిరేకల్  కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఓపీ పరీక్షలు నిర్వహించడంతో పాటు అడ్మిట్ చేసుకుని శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు, ఇవి కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఓపీ సేవలు అందిస్తున్నారు.గర్భిణులు సర్కారు దవాఖానల్లోనే ప్రసవాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మరో వైపు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. డాక్టర్లు, సిబ్బంది నియామకంపై దృష్టి కేంర్రీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు దవాఖానల్లో ఖాలీగా ఉన్న పోస్టులు లెక్క తేల్చి 2118 వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇతర సిబ్బంది పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మరో 3 వేల పోస్టులు అదనంగా అవసరమని అంచనా వేసిన వైద్య ఆరోగ్య శాఖ వీటికి సంబంధించిన ఫైలు ప్రభుత్వానికి పంపింది. దీంతో పాటు దవాఖానల్లో ఐసీయూ కేంద్రాలను నెలకొల్పడం ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
పేద వర్గాలకు చెందిన మహిళలు గర్భం దాల్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని దవాఖానలో అయినా తన పేరు నమోదు చేసుకోవచ్చు. గర్భిణులు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేసి రోబస్ట్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. గర్భినిగా రెండవసారి దవాఖానలో పరీక్ష చేయించుకున్న వెంటనే రూ. 3వేలు ఆమె ఖాతాలతోకి బదిలీ అవుతాయి. ప్రసవం జరిగిన వెంటనే అమ్మాయి అయితే రూ. 5వేలు, అబ్బాయి అయితే రూ. 4వేలు జమ అవుతాయి. శిశువుకు మూడున్నర నెలలు వచ్చే సరికి ఐదు రకాల వ్యాక్సిన్లు ఇప్పించిన తర్వాత రూ. 2వేలు బ్యాంకులో జమ అవుతాయి. శిశువుకు సంబంధించిన అన్ని రకాల రోగ నిరోధక వ్యాక్సిన్లు ఇచ్చి ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిన తరువాత మిగతా రూ. 3వేలు బ్యాంకులో జమ అవుతాయి. తద్వార ఆడపిల్లను కన్న తల్లికి రూ. 13వేలు, మగ పిల్లాడిని కన్న తల్లికి రూ. 12వేలు అందుతాయి.
Tags:Increased transmissions in government hospitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *