Date:09/05/2020
విశాఖపట్టణం ముచ్చట్లు:
కరోనా మహమ్మారి ఏపీలో అలుపెరగని వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో టెర్రర్ పుట్టిస్తున్న వైరస్ తాజాగా రాష్ట్రంలో సేఫ్ జోన్ లో ఉన్న ఒకే ఒక్క విజయనగరం జిల్లాలో కూడా తాజాగా ఎంటర్ అయింది. దీంతో కరోనా యావత్ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం మొత్తం పదమూడు జిల్లాలలో యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కేసుల సంఖ్య రోజుకు పదుల సంఖ్యలో బయటపడుతుండగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా బయటపడం ఆందోళన కలిగిస్తుంది. నిజానికి విశాఖలో తొలి రోజుల్లోనే కేసులు బయటపడంతో వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.
కానీ కట్టడిలో అక్కడి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతో కొంత ప్రభావితం తగ్గింది.ఇక ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో ఒక్క విశాఖలోనే కేసులు బయటపడగా మిగతా రెండు జిల్లాలలో కేసులు లేకపోవడంతో కొంతవరకు ఉత్తరాంధ్ర సేఫ్ జోన్ లోనే ఉందనుకున్నారు. కానీ దాదాపు నెల రోజుల లాక్ డౌన్ అనంతరం శ్రీకాకుళంలో తొలికేసు నమోదవడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇక దాదాపు నెలన్నర లాక్ డౌన్ లో కూడా తాజాగా విజయనగరంలో తొలికేసు నమోదైంది.మరోవైపు విశాఖలో వైరస్ వ్యాప్తి కూడా వేగంగా జరుగుతుంది. గురువారం ఒక్కరోజే ఇక్కడ ఏడు కొత్త కేసులు బయటపడగా దీంతో మొత్తం జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. ఇక విజయనగరంలో నమోదైన మూడు పాజిటివ్ కేసులలో ఒకరు గుజరాత్ నుండి వచ్చిన మత్స్యకారుడు కాగా మరొకరు వలస కూలీ. మూడో వ్యక్తి ఇంట్లో ఉండే గృహిణిగా తెలుస్తుంది.కాగా ఇప్పుడు మత్య్సకారుడితో పాటు గుజరాత్ నుండి వచ్చిన మిగతా మత్సకారులు.
వలస కూలీతో పాటు జిల్లాకు వచ్చిన మిగతా కూలీలకు కూడా టెస్టులు చేయాల్సి ఉంది. ఈ పరీక్షలలో భారీగా కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మూడో పాజిటివ్ వ్యక్తయిన మహిళతో కాంటాక్ట్ కేసులను గుర్తించే పనిలో అధికారులు బిజీగా ఉండగా మరో రెండు మూడు రోజులలో పూర్తిస్థాయిలో ఇక్కడ పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కాగా మరోవైపు విశాఖలో గురువారం వేకువజామున ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటన ఉత్తరాంధ్రను విషాదంలోకి నెట్టేసింది. ఇప్పటికే విశాఖ జిల్లా అధికార వర్గాలన్నీ ఆ ఘటనతో బిజీగా ఉన్నాయి. మొత్తం ఐదు గ్రామాల ప్రజలు అస్వస్తతకు గురికాగా వారు కోలుకునే వరకు ఇటు కరోనా అటు గ్యాస్ లీకేజీ ఘటన రెండిటినీ అధికారులు మ్యానేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవిధంగా ఇప్పుడున్న పరిస్థితి ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మద్యం, ఇసుక అక్రమాలకు ఇక చెక్
Tags: Increasing corona cases in Uttarakhand