తెలంగాణలో పెరుగుతున్న టెంపరేచర్

Increasing temperatures in Telangana

Increasing temperatures in Telangana

Date:15/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు :
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 5 డిగ్రీలు ఎక్కువగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల చొప్పున పెరుగుదల నమోదవుతోంది.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఎండల తీవ్రత నెమ్మదిగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.కొన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి మధ్య వ్యత్యాసం చాలా అధికంగా ఉంటోంది. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్య కిరణాలు నేరుగా నేలను తాకుతుండడంతో భూ వాతావరణం త్వరగా వేడెక్కి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయిఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
నైరుతి రుతుపవనాలు బలహీనం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు.అధిక ఉష్ణోగ్రతల కారణంగానే హైదరాబాద్‌ దాని పరిసర ప్రాంతాల్లో  క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిశాయని చెప్పారు.
ఇదిలావుండగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో  రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు తెలిపారు.
Tags:Increasing temperatures in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *