యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు

Date;27/02/2020

యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు

విజయనగరం ముచ్చట్లు:

ది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ హౌసింగ్‌ స్కీమ్‌ పేరుతో దందాలు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డులు మాటున స్వాహా పర్వం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు ఉదాశీనతే కారణమనే విమర్శలు వినపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది స్వయంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన స్థలంలో హౌసింగ్‌ స్కీమ్‌ ఎలా అనుమతులు ఇచ్చారో ప్రభుత్వ అధికారులకే తెలియాలి.జివిఎంసి 66వ వార్డు వెంకటాపురం సర్వేనెంబర్‌ 76, 76/ఎలో ప్రభుత్వానికి చెందిన సుమారు 3.5 ఎకరాల భూమి ఉంది. శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో ఇక్కడ భూములకు రెక్కలు వచ్చాయి. క్రమక్రమంగా ఇక్కడ ఆక్రమణదారులు ఇందులో చొరబడి సుమారు ఎకరం భూమిని స్వాహా చేశారు. అప్పటికి కళ్లు తెరిచిన రెవెన్యూ అధికారులు మిగిలిన భూముల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా తజాగా హౌసింగ్‌ స్కీమ్‌ పేరుతో మళ్లీ అక్రమాలకు తెరలేపారు. స్థానిక తెలుగుదేశంపార్టీ నాయకులు ఇక్కడ హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరు చేయడానికి కొంత సొమ్ము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరపటానికి మరికొంత సొమ్మును లబ్ధిదారుడి నుంచి తీసుకొని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీనిపై స్థానిక పెద్దలు ఆందోళనలు చేపట్టనప్పటికీ అధికారుల అండదండలతో నోళ్లు నొక్కేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఉదాశీనతే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా ఆక్రమణలు వార్డులో పరిధిలో అనేకం జరగడంతో ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ ఐఎఎస్‌ ఆధికారి ఇక్కడ పర్యటించి రెవెన్యూ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవల్సిందిగా కోరుతున్నారు.

 

 

Tags;Increasingly illegal structures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *