పట్టపగలే దారుణ హత్య

-హత్యకు దారితీసిన తలారి పోస్టు

Date:25/06/2019

 

జోగులాంబ ముచ్చట్లు:

వంతులవారిగా వస్తున్న తలారి పదవి కోసం చెలరేగిన వివాదంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామంలో వంతులవారిగా తలారి విధులు నిర్వహిస్తుండేవారు. వారసత్వంగా వస్తున్న విధిని అందరూ వంతులు వారిగా చేసేవారు. గతంలో తలారి నర్సన్న మరణించిన తర్వాత అతని కుమారులు చిన్న తాయన్న,  దేవేందర్,  పెద్ద తాయన్న మరణం తర్వాత కుమారుడు రాజు విధులు నిర్వహిస్తున్నాడు.   తాయన్న సోదరుడు చిన్న తాయన్న కుమారుడు వెంకటన్నలతో పాటు మరికొందరూ తలారి ఉద్యోగం వంతులుగా వారిగా చేసేవారు. తలారి ఉద్యోగం పర్మినెంట్ కావడంతో తాయన్న కుమారుడు రాజు తాను ఒక్కడ్నే చేస్తానని మిగతావారితో పలు మార్లు వాదనలు, పంచాయతీలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం ఉదయం ధరూర్ నుంచి ర్యాలంపాడుకు వెళ్లిన రాజు, అక్కడ అందరిని పలకరించాడు. బైక్ మీద కూర్చున్న రాజు  గ్రామస్థులతో మాట్లాడుతుండగా అతనిపై దాడి జరిగింది.

 

 

 

 

వెంకటన్న అనే వ్యక్తి తలపై వేటు వేయడంతోబైక్ పై నుంచి కిందపడినా రాజును మరోసారి నరకడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. చంపిన వ్యక్తిని పట్టుకోవడానికి గ్రామస్తులు ప్రయత్నించారు. వారిని కొడవలితో భయపెట్టి అక్కడ నుంచి పారిపోయాడు. పట్టపగలే హత్య జరుగడంతో  గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.  హత్య విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ ఎం.రాము, తన సిబ్బందితో సంఘటనస్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బంధోబస్తు చేశారు. సంఘటనస్థలానికి జిల్లా ఎస్పీ కేపి లక్ష్మి నాయక్,  డీఎస్పీ షాకీర్ హుస్సేన్  పరిశీలించారు.

మోడీ ప్రభుత్వం లోనే మైనారిటీ ల అభివృద్ధి : ఖలీఫతుల్లా

Tags: Incredibly murderous

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *