మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన దిశ పోలీసుల అదుపులో యువకుడు
బాపట్ల ముచ్చట్లు;
మైనర్ అమ్మాయి పట్ల పక్కింట్లో ఉండే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. యువకుడి నుండి తప్పించుకున్న అమ్మాయి దిశ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చింతపల్లిపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
చింతపల్లిపాడు గ్రామంలో నివాసముండే వెంకి అనే యువకుడు పక్కింట్లో ఉండే మైనర్ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటకు వెళ్తున్న మైనర్ అమ్మాయిని వెంకి బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. వెంకి భారి నుండి తప్పించుకున్న అమ్మాయి ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాకుండా తండ్రి ఫోన్ నుండి దిశ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.
దిశ కు కాల్ చేసిన 10 నిముషాల వ్యవధిలో బాధితురాలి ఇంటికి యద్దనపూడి పోలీసులు చేరుకున్నారు. మైనర్ బాలిక, కుటుంబసభ్యులు ఇచ్చిన వివరాలను పోలీసులు సేకరించారు. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన వెంకి ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మైనర్ బాలికను వెంకి తన ఇంట్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ నేపథ్యంలో నిందితుడు వెంకి పై ఐపీసీ సెక్షన్ 354, 323, 324, 509, ఫోక్సో యాక్ట్ కింద యద్దనపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
దిశ యాప్ ను కొన్ని నెలల కిందటే స్థానికంగా ఉండే సచివాలయ సిబ్బంది తమ ఫోన్ లో డౌన్లోడ్ చేయించారని మైనర్ బాలిక గుర్తుచేసింది. ఈ రోజు ఆపదలో ఉన్న తనకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. తనలాగే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ దిశ యాప్ ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని బాధితురాలు స్పష్టం చేసింది.

Tags:Indecent behavior on a minor girl
Disha is a youth in police custody
