Indefinite protests from August 17 if the merger decision in APCOS is not withdrawn

APCOSలో విలీన నిర్ణయాన్ని ఉప‌సంహ‌రించుకోకుంటే ఆగస్టు 17 నుండి నిరవధిక నిరసనలు 

-టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఎం.నాగార్జున

Date:02/08/2020

తిరుప‌తి ముచ్చట్లు:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని విలీనం చేయాల‌ని టిటిడి తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉపసంహ‌రించకపోతే ఆగస్టు 17 నుండి టిటిడి పరిపాలనా భవనం ఎదుట నిరవధిక నిరసనలు చేపడతామని ఎం.నాగార్జున తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో ఆదివారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని APCOSలో విలీనం చేస్తూ టిటిడి బోర్డు చేసిన తీర్మానాన్ని త‌క్ష‌ణం ర‌ద్దు చేయాల‌ని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఒకవైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను APCOSలో కలపరాదని నిరసనలు తెలుపుతుంటే, మరోవైపు టిటిడి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి APCOSలో కలిపేందుకు అనుమతులు పొందారని చెప్పారు. తిరుపతిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఔట్సోర్సింగ్ కార్మికులను మరింత ఆందోళనకు గురి చేసేలా యాజమాన్యం వ్యవహరించడం దారుణమన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంద‌రూ ఏకతాటిపైకి వచ్చి టిటిడి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాలన్నారు. సమస్య పరిష్కారానికి ఆగస్టు 16వ తేదీ వరకు టిటిడి యాజమాన్యానికి గడువు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్ర‌కారం అంద‌రికీ టైంస్కేల్ వ‌ర్తింప చేయాల‌ని కోరారు. టిటిడి అట‌వీ కార్మికుల‌కు, శ్ర‌వ‌ణం సిబ్బందికి ఇచ్చిన టైంస్కేల్ అన్యాయ‌మైంద‌ని, గోశాల‌, మార్కెటింగ్‌, వాహ‌న‌బేర‌ర్ల‌కు ఇచ్చిన త‌ర‌హాలో వీరికి టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. టిటిడిని న‌మ్ముకుని చాలీచాల‌ని జీతాల‌తో జీవ‌నం సాగిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు, హాస్టళ్లు తదితర కొన్ని విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, కోవిడ్-19 సమయంలో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు హ‌రిప్రసాద్, హరి, నవీన్, రూప్ కుమార్, గురుకుమార్, మునిరత్నం, తులసి తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని పర్యటనకు సిద్దమవుతున్న అయోధ్య

Tags: Indefinite protests from August 17 if the merger decision in APCOS is not withdrawn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *