మదనపల్లె లో మానవ జాతికి మాయని మచ్చ – జంట హత్యలు

-ఆధ్యాత్మిక విశ్వాసాలకు హద్దుండాలి..

-మదనపల్లె సంఘటన మేల్కొలపాలి…

-ముఖ్యంగా విద్యావంతుల్లో వివేకం విచక్షణ, యధార్థ వాదం వికసించాలి…

-మీరు మార్గదర్శులు మీరే మూర్ఖంగా మారితే సమాజానికి వెలుగెక్కడిది…

-చదువుకున్న జనాలు విజ్ఞానంతో వికాసవంతమైన ఆధునికత వైపు అడుగేయాలి, అంధత్వ విశ్వాసాలకు పాతరేసి ప్రశాంతంగా జీవించాలి..

Date:27/01/2021

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె లో 24/01/2021 జరిగిన విషాదం గురించి విన్న తర్వాత చాలా బాధ కలిగింది. వారిది దిగువ తరగతి కి చెందిన కుటుంబం కాదు. Uneducated ఫ్యామిలీ అంత కన్నా కాదు. తండ్రి ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్. కెమిస్ట్రీ ప్రొఫెసర్. తల్లి ఒక ఫేమస్ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్. గణితం లో గోల్డ్ మెడలిస్ట్. ఉన్నత విద్యను అభ్యసించిన తెలివైన ఇద్దరు కుమార్తెలు, ఆహ్లాదాన్ని పంచే ఒక పెంపుడు కుక్క, విశాలమైన ఇల్లు, ఆర్థికంగా ఎటువంటి లోటు లేని హ్యాపీ ఫ్యామిలీ – ఇది పైనుండి కనిపించే దృశ్యం.మరి తమ కన్న బిడ్డలను తమ స్వహస్తాలతో మర్డర్ చేసుకునేంత పిచ్చి ఆ తల్లిదండ్రులకి ఎక్కడ నుండి వచ్చింది అని ఆలోచిస్తే – అది మానసిక రోగమే అని అర్థమవుతోంది. కానీ అది బ్రెయిన్ లో రసాయన చర్యల వల్ల గానీ, లేక జన్యుపరంగా గా వచ్చిన మానసిక రోగం కాదు.ఇది తెచ్చి పెట్టుకున్న రోగం! New Age terminology లో చెప్పాలంటే దానికి ‘spritual awakening’ లేదా ‘spiritual enlightenment’ అని పేరు.Spritual గా ఉండేవారు అందరూ మానసిక రోగులు అనట్లేదు.కానీ spirituality పేరు తో, రియాలిటీకి దూరం అయి, delusional గా,ఊహా ప్రంపంచాలలో తేలియాడుతూ, conspiracy theories నే సత్యాలు గా భావిస్తూ, కామన్ సెన్స్ కి పూర్తిగా దూరం అయేట్టుగా spiritual గురువుల చేత బ్రెయిన్ వాష్ చేయబడి, తమ పిల్లలను కూడా బ్రెయిన్ వాష్ చేసి, తమ కుటుంబాలను స్వహస్తాలతో నాశనం చేసుకుంటున్నారు ఎందరో…

 

 

 

హత్య చేయబడిన పెద్ద కుమార్తె అలేఖ్య పబ్లిక్ Instagram photos చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. She is a well read, well articulated girl అని అర్థం అవుతుంది. కాని కొన్ని ఫొటోస్ లో ఆమె వెనక మెహెర్ బాబా, బుద్ధుడు ఫోటోలు కనిపిస్తే, తన స్టడీ టేబుల్ మీద ఓషో కనిపిస్తాడు. ఒక పోస్ట్ లో ధ్యానము చేయటం వలన ఆమె eye sight తగ్గిందని,తన చర్మ కాంతి పెరిగింది అని చెప్తే, వేరే పోస్ట్ లో శివుడే తన ఆది గురువు అని, దుర్గా మాత తన feminist icon అని చెప్తుంది. ధ్యానము తప్ప మానవ జన్మ కి ఇంకేమి అవసరం లేదని, ఓషో అందించిన ఈ (అ)జ్ఞానానికి ki ‘osho love’ అని పేరు కూడా పెట్టుకుంది. It’s very clear she was undergoing a ‘spiritual phase’ like many young people and teenagers these days.ఈ మానసిక రోగం పిల్లల నుండి పేరెంట్స్ కి పాకిందా, లేదా పేరెంట్స్ నుండి పిల్లలకి పాకిందా అనే విషయం తెలియదు. పోలీస్ కథనాల ప్రకారం ఆ తల్లిదండ్రులు, “నేటి తో కలియుగం అంతమైంది, సత్య యుగం ప్రారంభం కాబోతోంది, దయ చేసి పిల్లల మృతదేహాలను తీసుకుని వెళ్ళద్దు, వారు రేపు తిరిగి లేస్తారు, జీవం లో కి వస్తారు” అని చెప్పారట! ఎంతటి delusion! ఎంతటి విషాదం!మానసిక ప్రశాంతత కోసం, నిద్ర బాగా పట్టడం కోసం, లేదా ఏకాగ్రత కోసం ధ్యానం చేయటం ఒకటైతే, అతీంద్రియ శక్తుల కోసం, ముక్తి కోసం, మందులు లేకుండా రోగాల్ని తగ్గించడం కోసం ధ్యానం చేయటం మూర్కత్వం మాత్రమే కాదు, హానికరం కూడా.

 

 

మనకి తెలిసిన కుటుంబాలు ఏమైనా ఇలా spirituality ఉచ్చు లో పడి కొట్టుకు పోతుంటే, వారు ఎటువంటి అఘాయిత్యాలు చేయకముందే intervene అవటం మన బాధ్యత. వీరిని చాలా సులభం గా గుర్తించవచ్చు.

1.జనరల్ గా ఇలాంటి వారికి ఒక మాటకారి అయిన narcissistic గురువు(cult leader) ఉంటాడు, అతనికి ఒక ఆశ్రమం కూడా ఉంటుంది.

2.మూడో కన్ను తెరిపిస్తాను, విభూతి రాలుస్తాను, గాలి లో astral travel చేస్తాను, నీటి లో నడుస్తాను,భవిష్యత్తును మూడో కంటితో చూడగలను, మందులు లేకుండా జబ్బులు తగ్గిస్తాను, మీ తల మీద చెయ్యి పెట్టి నా శక్తుల్ని మీకు transfer చేసి, మీకు ముక్తి ప్రసాదిస్తాను వంటి మాటలు మాట్లాడతాడు.

3. Usually such gurus thrive on conspiracy theories. ప్రపంచం అంతం కాబోతోంది అనో, కలియుగం అంతం కాబోతోంది అనో, మూడో ప్రపంచ యుద్ధం రాబోతోంది అనో , జడ్జిమెంట్ డే రాబోతోంది అనో భయపెట్టి, నా భక్తులకు మాత్రం ఎటువంటి ప్రమాదం వాటిల్లదు . లేదా అందరూ మరణిస్తే తన భక్తులు మాత్రం స్వర్గానికి చేరుకుంటారు అనో theories అల్లుతూ ఉంటాడు….

4. తనకంటూ ఒక ప్రత్యేకమైన meditation technique ఉంటుంది. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టమంటే, ఇంకొంత మంది క్రియ యోగ వంటి techniques బోధిస్తారు….

5. తనకంటూ ఒక పూర్వ జన్మ స్టోరీ ఉంటుంది. For example, తాను విష్ణు అవతారం అనో, పూర్వ జన్మ లో తాను సాయి బాబా అనో వారి చరిత్ర వారే రాసుకుంటారు…..

6. Aura, cosmic energy, crystals, pyramids, vibrations, waves, astral body projection, life after death, reincarnation, karma, soul, third eye,masters, chakras వంటి మాటలు ఎక్కువగా వినపడతాయి.

7. గ్యారంటీ గా ఒక సైడ్ బిజినెస్ ఉంటుంది. పిరమిడ్స్, క్రిస్టల్స్, పుస్తకాలు, ఫోటోలు, కాసెట్ లు, లోకెట్స్, గోముత్రాలు, మూలికలు వంటి అమ్మకాలు ముమ్మరంగా సాగుతుంటాయి.

8. ఆశ్రమాలలో భక్తులని ట్రాన్స్ state లోకి తీసుకు వెళ్లడానికి డ్రగ్స్ వాడకం చాలా కామన్. లైంగిక వేధింపులు కూడా కామన్.

9. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా పనిచేస్తుంది. ఒక కుటుంబాన్ని లోబర్చుకున్న తర్వాత, వారిని వారి బంధువుల మీద, స్నేహితుల మీద, neighbors మీద వదులుతారు బ్రెయిన్ వాషింగ్ కి.

ధ్యానం, యోగ వంటి వాటిని కేవలం exercise and relaxation techniques లాగ భావించకుండా, వాటికి శక్తులు, ముక్తులు అంటగట్టే గురువులు, వారిని నమ్మే గొర్రెలు ఉన్నంత కాలం ఇలాంటి కుటుంబాలు నాశనం అవుతునే ఉంటాయి…

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: Indelible mark on the human race in Madanapalle – twin murders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *